breaking news
Vale
-
బ్రెజిల్లో ఘోర ప్రమాదం
బ్రసిలియా : ఆగ్నేయ బ్రెజిల్లో భారతకాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెలో హారిజాంటే ప్రాంతంలో మైనింగ్ దిగ్గజం వాలే కంపెనీ వ్యర్థ పదార్థాలను వేరు చేసేందుకు నిర్మించిన ఆనకట్ట కూలిపోయింది. ఈ క్రమంలో భారీ స్థాయిలో బురద వరదలా పొంగి సమీపంలో ఉన్న ఓ భవన సముదాయాన్ని ముంచెత్తింది. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 300 మంది గాయపడ్డారు. సహాయకచర్యలు చేపట్టిన అధికారులు ఇప్పటివరకు 9 మంది మృతదేహాలను వెలికితీశారు. మిగతావారి కోసం గాలిస్తున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. మూడేళ్ల క్రితం కూడా ఇటువంటి ఘటనే జరిగింది. మినాస్ గెరాయిస్‌లోనే ఓ పట్టణంలో డ్యామ్ కూలిన ఘటనలో 19 మంది మృతి చెందారు. -
ధనుష్‌తో మళ్లీ మళ్లీ..
నటుడు ధనుష్‌తో నటి అమలాపాల్ మళ్లీ మళ్లీ నటించేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీరిది హిట్ జంటనే చెప్పాలి. ప్రముఖ ఛాయాగ్రాహకుడు వేల్ దర్శకత్వంలో ధనుష్, అమలాపాల్ నటించిన వేలై ఇల్లా పట్టాదారి సూపర్‌హిట్ అరుున విషయం తెలిసిందే. ధనుష్ నిర్మించిన అమ్మా కణక్కు చిత్రంలో నాయకి అమలాపాల్‌నే. ఇక ప్రస్తుతం వెట్రిమారన్ దర్శకత్వంలో ధనుష్‌కు నాయకీ అమలాపాలే. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే ధనుష్, అమలాపాల్ మరో చిత్రంలో కలిసి నటించడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. వేలై ఇల్లా పట్టాదారి చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనున్నట్లు ఇప్పటికే ధనుష్ స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ధనుష్ మరదలు, సూపర్‌స్టార్ రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో హీరోరుున్ల గురించి రకరకాల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అసలు ఆ చిత్ర నారుుకలు ఎవరన్న ప్రశ్న తలెత్తుతోంది.అరుుతే ఈ విషయంలో ఒక క్లారిటీ వచ్చింది. వేల్లై ఇల్లా పట్టాదారి-2 చిత్రంలో ధనుష్‌కు జంటగా అమలాపాల్ నటించనున్నారు.ఆమెతో పాటు నటి కాజల్‌అగర్వాల్, మంజిమామోహన్ నటించనున్నట్లు తెలిసింది.ఈ క్రేజీ చిత్రాన్ని కబాలి నిర్మాత కలైపులి ఎస్.థాను నిర్మించనున్నారు. అమలాపాల్ ఇప్పటికే చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. వడ చెన్నై చిత్రంతో పాటు తిరుట్టు పయలే-2, మలయాళంలో ప్రకాశ్‌రాజ్, జయరాం, ఉన్ని ముకుందన్తో కలిసి ఒక చిత్రంలో నటిస్తున్నారు. దర్శకుడు విజయ్ నుంచి విడిపోరుు నటనపై పూర్తి దృష్టి సారిస్తున్న అమలాపాల్ తన పక్కింటి అమ్మారుు ఇమేజ్ను బ్రేక్ చేసే విధంగా అందాలను ఆరబోస్తూ తీరుుంచుకున్న ఫొటోలను తన ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ పరిశ్రమ దృష్టి తన వైపునకు మరల్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్లేన్ క్రాష్: కుటుంబంతో సహా మాజీ సీఈఓ మృతి
సావో పాలో : బ్రెజిల్‌లోని ఉత్తర సావో పాలో లో మినీ విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో బ్రెజిల్‌లోని ప్రముఖ మైనింగ్ సంస్థ వేల్ మాజీ సీఈఓ రోజర్ ఏజ్నెల్లీతో పాటూ అయన కుటుంబసభ్యులు కూడా ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో రోజర్ ఏజ్నెల్లీ, ఆయన భార్య, ఇద్దరు పిల్లలు విమానంలోనే ఉన్నారు. టేక్ ఆఫ్ అయ్యే సమయంలో ఓ భవనం పై విమానం కూలిపోయింది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఏజ్నెల్లీ దశాబ్ధ కాలానికి పైగా వేల్ సీఈఓగా పని చేసి 2011లో బాధ్యతల నుంచి తప్పుకున్నారు.