పోటాపోటీగా ప్రచారం  | kakatiya university professors elections | Sakshi
Sakshi News home page

పోటాపోటీగా ప్రచారం 

Feb 3 2018 12:22 PM | Updated on Aug 14 2018 5:56 PM

kakatiya university professors elections - Sakshi

కేయూ అధ్యాపకుల సంఘం (అకుట్‌ ) ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారం ముగియనుంది.

కేయూ క్యాంపస్‌: కేయూ అధ్యాపకుల సంఘం (అకుట్‌ ) ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శనివారం ముగియనుంది. ఇప్పటివరకు అకుట్‌ అధ్యక్ష పదవికి జియాలజీ విభాగాధిపతి ఆర్‌.మల్లికార్జున్‌రెడ్డి, దూరవిద్య కేంద్రం డైరెక్టర్‌ దినే‹ష్‌కుమార్‌ నామినేషన్లను దాఖలు చేశారు. కొద్ది రోజులుగా పోటా పోటీ గా ప్రచారం చేస్తున్నారు. ఇక ప్రధా న కార్యదర్శి పదవికి ముగ్గురు అధ్యాపకులు పోటీపడుతున్నారు. బోటనీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ముస్తఫా, కెమిస్ట్రీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హన్మంతు, జువాలజీ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ రాజేందర్‌ తమ నామినేషన్లను సమర్పించారు. ఉపాధ్యక్ష పదవికి మ్యాథమెటిక్స్‌ విభాగం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ తిరుమలాదేవి నామినేషన్‌ దాఖలు చేశారు. ప్రధాన కార్యదర్శి వివిధ విభాగాల అధ్యాపకులు సుజాత, పద్మజ, రమణ నామినేషన్లు సమర్పించారు. 

8న ఎన్నికలు.. 
శనివారం సాయంత్రం 4గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది, 5న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. ఈనెల 8న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటింగ్‌ ప్రక్రియ ఉంటుంది. క్యాంపస్‌లోని సెనేట్‌ హాల్,ఆర్ట్స్‌ కళాశాలలోని గ్రంథాలయం, కొత్తగూడెం ఇంజినీరింగ్‌ కళాశాలలో పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. 162 మంది రెగ్యులర్‌ అధ్యాపకులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈనెల 9న ఓట్లను లెక్కించి అదేరోజు ఫలితాలను వెల్లడిస్తారు. ఏఆర్‌ శ్రీధర్‌ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరిస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement