మల్చింగ్ పద్ధతితో పంటలకు మేలు | Mulching method better to crops | Sakshi
Sakshi News home page

మల్చింగ్ పద్ధతితో పంటలకు మేలు

Sep 29 2014 1:58 AM | Updated on Sep 2 2017 2:04 PM

మొక్కల చుట్టూ నేలను ఏదైనా పదార్థంతో కప్పి పెట్టడాన్ని మల్చింగ్ అంటారు.

మల్చింగ్ అంటే..
 
 మొక్కల చుట్టూ నేలను ఏదైనా పదార్థంతో కప్పి పెట్టడాన్ని మల్చింగ్ అంటారు. ఈ పద్ధతిని రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు.

 మొదటి పద్ధతి
 ఎండుగడ్డి, ఎండిన ఆకులు, వరిపోట్టు, రంపం పొ ట్టులు మొక్క చుట్టూ రెండు నుంచి ఐదు అంగుళాల మందంలో వేయాలి. ఇవి పంటకాలంలో పంటకు మల్చింగ్‌తోపాటు ఆతర్వాత సేంద్రియ ఎరువుగా ఉపయోగపడతాయి.

 రెండో పద్ధతి...
 ప్లాస్టిక్ షీట్లను ఉపయోగించి మొక్క చుట్టూ నేలను కప్పి ఉంచుతారు. వేసవిలో నీరు ఎండ వేడిమికి ఆవి రికాకుండా తేమ నిలుపుకొనడం, కలుపు మొక్కలు నివారించబడి పంట ఏపుగా పెరుగుతుంది.

 పండ్ల తోటలకు ఇలా...
 మొక్క పాదుకు సరిపడా షీట్‌ను కత్తిరించి మధ్యలో గుండ్రంగా మొక్క కాండానికి సరిపడా రంధ్రం చేసి బయటకు చీలిక చేయాలి. చీలిక గుండా కాండం మధ్యలోకి వచ్చేలా తొడిగి మట్టితో షీట్ అంచులు కప్పాలి. తర్వాత మూడు నాలుగు అర్థచంద్రకారంలో రంధ్రాలు చేస్తే భూమిలోకి నీరు ఇంకుతుంది.
 
కూరగాయల పంటల్లో ...
 కూరగాయల పంటల్లో మల్చిం గ్ షీట్‌ను పంట విత్తేముందు లేదా మొక్కలు మొలి చిన తర్వాత గానీ వేసుకోవచ్చు.
 
విత్తే ముందు వేయడం ఇలా..
 మొక్కల మధ్య, వరుసల మధ్య గల దూరాన్ని బట్టి ముందే షీట్‌కు రంధ్రాలు చేయాలి. రంధ్రాలు చేసిన షీట్‌ను నాగలి సాలు మీద పరిచి, రెండు వైపులా కొనళ్లపై మట్టి ఎగదోస్తే కవర్లు కొట్టుకుని పోకుండా ఉంటాయి. రంధ్రాల్లో 2 నుంచి 3 విత్తనాలు వేసి మట్టిని కప్పాలి.
 
మొలిచిన పంట మీద ఇలా..
 మొక్క చుట్టూ వేసేందుకు అనుకూలంగా షీట్‌ను తగిన సైజులో కత్తిరించి, ప్రతి మొక్క మొదటలో వచ్చేలా తొడగాలి.
 
 ఉపయోగించుకోవడం ఇలా...
 
 మల్చింగ్ షీట్లు చాలా రంగుల్లో, వివిధ రకాల మందంతో మార్కెట్‌లో లభిస్తాయి. సీజన్, వేసే పంటను బట్టి మల్చింగ్ షీట్లను ఎంపిక చేసుకోవాలి.
 
ఎంత విస్తీర్ణంలో మల్చింగ్ చేసుకోవాలో అందుకు తగ్గట్టుగా సాళ్ల పొడువును బట్టి లెక్క వేయాలి.
 
వర్షాకాలంలో రంధ్రాలున్నవి, తోటలకైతే ఎక్కువ మందంగలవి, వేసవి పంటలకు తెల్లని పురుగుల నివారణకు వెండి రంగు, కలుపు నివారణకు నలుపు రంగు మల్చింగ్ షీట్లను ఉపయోగించాలి.
 
షీట్లను పశువులు తొక్కకుండా చూసుకోవాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement