విత్తనశుద్ధితో తెగుళ్లు దూరం | pests away with seed treatment | Sakshi
Sakshi News home page

విత్తనశుద్ధితో తెగుళ్లు దూరం

Nov 27 2014 11:46 PM | Updated on Sep 2 2017 5:14 PM

రబీలో భాగంగా శనగ పంటలు సాగు చేసే వారు తప్పకుండా విత్తనశుద్ధి...

రాయికోడ్: రబీలో భాగంగా శనగ పంటలు సాగు చేసే వారు తప్పకుండా విత్తనశుద్ధి చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి అభినాష్‌వర్మ రైతులకు సూచించారు. మండలంలోని పాంపాడ్ గ్రామంలో గురువారం నిర్వహించిన పొలంబడి కార్యక్రమంలో శనగ సాగుపై అన్నదాతలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విత్తన శుద్ధి ద్వారా పంట తెగుళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటుందని సూచించారు.

మందుల వినియోగంలో విధిగా అధికారుల సూచనలు పాటించి పంటను కాపాడుకోవాలన్నారు. రసాయన ఎరువులను అధికంగా వాడితే నష్టం తప్పదని హెచ్చరించారు. అనంతరం రైతులు సాగు చేసిన శనగ పంటలను సందర్శించి పలు సూచనలు చేశారు. సమావేశంలో ఏఈఓ యాదయ్య, స్థానిక నాయకులు హన్మన్నపాటిల్, రైతులు గోపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement