ప్రేమతో పిజ్జా! | Ileana D'Cruz loves cooking for her beau Andrew Kneebone | Sakshi
Sakshi News home page

ప్రేమతో పిజ్జా!

Nov 3 2017 12:14 AM | Updated on Nov 3 2017 12:14 AM

Ileana D'Cruz loves cooking for her beau Andrew Kneebone - Sakshi

.. చేసిపెట్టారట అందాల ముద్దుగుమ్మ ఇలియానా. ఎవరికోసమో తెలుసా? ఇంకెవరి కోసం ప్రియుడు ఆండ్రూ కోసం. ప్రియురాలు చేసి పెట్టిన పిజ్జాని ఆండ్రూ ప్రేమగా ఆరగించారట. అది చూసి ఈ గోవా బ్యూటీ తెగ మురిసిపోతున్నారు. ఇటీవల హిందీ చిత్రాలు ‘ముబారకాన్, బాద్షాహో’ చిత్రాల్లో నటించిన ఇలియానా కొంత రిలాక్సేషన్‌ కోరుకున్నారు. అంతే.. ఆండ్రూతో హాలిడే ట్రిప్‌కి వెళ్లారు. ముంబై తిరిగొచ్చాక.. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఇలియానాను ‘మీకు వంట వచ్చా?’ అని ఓ జర్నలిస్ట్‌ అడిగితే – ‘‘నేనెంత బాగా తింటానో అంతే బాగా వండుతాను.

నేను చేసే పిజ్జా అంటే ఆండ్రూకి చాలా ఇష్టం. కుక్కీస్‌ కూడా బాగా చేస్తాను. రీసెంట్‌గా యాపిల్‌ చిప్స్‌ చేశాను. అవి నా ఫేవరెట్‌. ఆండ్రూ కూడా వంట చాలా బాగా చేస్తాడు. అతనిదో డిఫరెంట్‌ స్టైల్‌. నేను వంట చేయడాన్ని మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను. రిలాక్స్‌ అవ్వడానికి వంట చేయడం ఓ మంచి అలవాటు. బయట పుడ్‌ ఆర్డర్‌ చేసుకుని తినడానికి అలవాటు పడినవాళ్లు ఓసారి ఇంట్లో వంట ట్రై చేసి చూడండి.

వండటంలో మజా ఏంటో తెలుస్తుంది’’ అన్నారు ఇలియానా. అంతా బాగానే ఉంది. మీకు వంట వచ్చా? అనడిగితే... ఆండ్రూ కూడా వండుతాడని చెప్పడం హైలైట్‌ అయింది. అడగకపోయినా ఆండ్రూ గురించి మాట్లాడుతున్నారంటే.. అతని గురించి మాట్లాడటం ఇలియానాకు ఆనందంగా ఉంటోందని పరిశీలకులు అంటున్నారు. ఈ మధ్యే ఆండ్రూని ‘బెటరాఫ్‌’ అని ఇలియానా పేర్కొన్న విషయం గుర్తుండే ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement