అమ్మమ్మలు తాతయ్యలు ఈ తరం ట్రెండీ పుడ్స్ ఆస్వాదించడం అరుదు. ఒకవేళ తినమని బలవంతం చేసినా అంతగా ఆసక్తి చూపరు, ఇష్టపడరు. కానీ ఈ 92 ఏళ్ల బామ్మ భలే ఇషంగా తింటూ మెచ్చుకుంటోంది కూడా. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో ఒక అమ్మాయ్ తన అమ్మమ్మకు పిజ్జా, కూల్‌డ్రింగ్ ఇప్పించాలనుకుంటుంది. అందుకోసం ఆన్‌లైన్‌లో ఆర్డర్‌పెడుతుంది. ఇంతలో ఆ ఆర్డర్ రానే వస్తుంది. ఆ విషయం అమ్మమ్మకు చెప్పి డైనింగ్ టేబుల్ వద్దకు తీసుకువస్తుంది. తినమంటుంది మనవరాలు. ఆ బామ్మ ఆ పిజ్జాని ఆస్వాదిస్తూ..చూపిస్తున్న హావాభావాలు చాలా క్యూట్‌గా ఉంటాయ్.
అమ్మమ్మలు ఏకిచిడి, పులిహోర తింటారనుకుంటే పొరపాటు..ట్రెండ్ మారింది వాళ్లు కూడా అప్‌డేట్ అవుతున్నారు అన్నట్లుగా ఉంది కదా ఈ బామ్మను చూస్తే. ఆమె చాలా చిన్నపిల్లలా ఎంజాయ్ చేస్తూ తినడం చూస్తే..మన అమ్మమ్మలకు, బామ్మలకు ఇలాంటి ఫుడ్ ఐటెమ్స ఇప్పించి చూడాలనిపిస్తోంది కదూ..!. ఇంకెందుకు ఆలస్యం ట్రై చేసి చూడండి మరి..
(చదవండి: వరల్డ్‌లోనే అత్యుత్తమ 'టీ'గా మసాలా చాయ్)


