వరల్డ్‌లోనే అత్యుత్తమ 'టీ'గా మసాలా చాయ్ | TasteAtlas Said Masala chai is officially the world's best tea | Sakshi
Sakshi News home page

వరల్డ్‌లోనే అత్యుత్తమ 'టీ'గా మసాలా చాయ్

May 29 2026 1:59 PM | Updated on May 29 2026 2:15 PM

TasteAtlas Said Masala chai is officially the world's best tea

"ఏ చాయ్ చమక్కునే చూడరా భాయ్" అంటూ పొద్దుపొద్దున పొట్టలో టీ చుక్క పడాల్సింది చాలామందికి. అదీగాక కాసేపు చాయ​ తాగుతూ మాట్లాడుకుందాం అంటూ..ఎన్నో సమస్యలు పరిష్కరించుకున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. అంత ఘన చరిత్ర ఉంది భారత్‌లో చాయ్‌కి. అలాంటి టేస్టీ టేస్టీ టీల్లో మన భారతీయ మసాలాటీనే అత్యుత్తమ చాయ్‌గా అగ్రస్థానంలో దక్కించుకుంది. 

ప్రసిద్ధ అంతర్జాతీయ ఫుడ్ ట్రావెల్ గైడ్‌ టేస్ట్‌ అట్లాస్‌ విడుదల చేసిన వంద అత్యుత్తమ మసాలా చాయ్‌ జాబితాలో మన భారతీయ మసాలా టీనే తొలి స్థానం దక్కించుకుంది. భారత్‌లో టీ ఒక పానీయం మాత్రమే కాదు. అది ఒక ఆచారం, సంభాషణను ప్రారంభించేది, పనిమధ్యలో తీసుకునే విరామంలాంటిది, రైల్వేఫ్లాట్‌ఫామ్‌లపై తప్పనిసరిగా ఉండేది, కొన్నిసార్లు ఉచిత చికిత్సలా పనిచేస్తుంది. 

మన దేశంలో అంత ప్రాముఖ్యత సంతరించుకున్న మన చాయ్‌కే అత్యుత్తమైనదిగా ఫుడ్‌ గైడ్‌ టేస్ట్‌ అట్లాస్‌ పట్టం గట్టడం విశేషం. అంతేగాదు భారతదేశం అద్భుతమైన టీని అందిస్తుందని కితాబు కూడా ఇచ్చేసింది. దీంతోపాటు మరికొన్ని ఇతర భారతీయ టీలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి.  అవేంటంటే..

మసాలా చాయ్ — 1వ స్థానం
డార్జిలింగ్ టీ — 6వ స్థానం
అస్సాం చాయ్ — 13వ స్థానం
సులేమానీ చాయ్, కేరళ — 39వ స్థానం
కాంగ్రా టీ, హిమాచల్ ప్రదేశ్ — 41వ స్థానం
నూన్ చాయ్, జమ్మూ కాశ్మీర్ — 43వ స్థానం

ప్రపంచ టీ జాబితాలో కేవలం భారతీయ టీలదే ఆధిపత్యం కాదు. హోజిచా టీ రెండవ స్థానంలో నిలిచింది. ఇది జపాన్‌కు చెందిన వేయించిన గ్రీన్ టీ. దీని వెనుకే శ్రీలంకకు చెందిన సిలోన్ బ్లాక్ టీ ఉంది. ఇది మృదువైన, అదే సమయంలో ఘాటైన బ్లాక్ టీ రకాలకు ప్రసిద్ధి చెందింది. తర్వాతి స్థానంలో సెంచా ఉంది, ఇది జపాన్‌కు చెందిన ఎంతో ఇష్టపడే గ్రీన్ టీ.ఐదవ స్థానంలో చైనాకు చెందిన పు ఎర్ ఉంది, దీనిని ఏజ్డ్ లేదా వింటేజ్ టీ అని కూడా పిలుస్తారు.

(చదవండి: ఎనిమిది దశాబ్దాలు, ఒక దుకాణం: వైరల్‌గా 94 ఏళ్ల వ్యాపారి కథ!)

 

 

Advertisement
 
Advertisement
Advertisement