వెధవలమని మీ ఉద్దేశమా?: షీలా దీక్షిత్ | Weren't we foolish, asks defeated Sheila Dikshit | Sakshi
Sakshi News home page

వెధవలమని మీ ఉద్దేశమా?: షీలా దీక్షిత్

Dec 8 2013 2:42 PM | Updated on Apr 4 2018 7:42 PM

వెధవలమని మీ ఉద్దేశమా?: షీలా దీక్షిత్ - Sakshi

వెధవలమని మీ ఉద్దేశమా?: షీలా దీక్షిత్

ప్రస్తుత్తం మేము వెధవలమని మీ ఉద్దేశమా? (బెవకూఫ్ హై నా) అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మీడియా రిపోర్టర్లపై మండిపడ్డారు.

ప్రస్తుత్తం మేము వెధవలమని మీ ఉద్దేశమా?  (బెవకూఫ్ హై నా) అంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మీడియా రిపోర్టర్లపై మండిపడ్డారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోరమైన ఓటమి నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి షీలా దీక్షిత్ రాజీనామా చేశారు.
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షీలా మాట్లాడారు. ఆమ్ ఆద్మీ పార్టీ పాపులారిటీని, ఢిల్లీ ప్రజలు మనోభావాలను అర్ధం చేసుకోవడంలో విఫలమయ్యారా అని మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు మేము వెధలమా అంటూ కోపంగా జవాబిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన తీర్పును అంగీకరిస్తామని షీలా అన్నారు. 
 
ఎన్నికలకు ముందే కాంగ్రెస్ ఎదురుగాలి తప్పదు అని సర్వేలు వెల్లడించాయి. గత మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన షీలా దీక్షిత్ నాలుగోసారి ఎన్నికల బరిలోకి దిగారు. అయితే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఆమ్ ఆద్మీ పార్టీ రంగంలో దిగడంతో షీలాకు ఈ ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగిలింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement