సినిమా హాల్లో కాల్పులు..ఇద్దరి పరిస్థితి విషమం! | Two shot at movie theatre in US | Sakshi
Sakshi News home page

సినిమా హాల్లో కాల్పులు..ఇద్దరి పరిస్థితి విషమం!

Jan 14 2014 3:56 PM | Updated on Oct 2 2018 2:30 PM

అమెరికాలో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు గాయపడినట్టు తెలుస్తోంది.

అమెరికాలో ఓ ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు గాయపడినట్టు తెలుస్తోంది. ఈ దుర్ఘటన సోమవారం ఉదయం యూఎస్ లో ఫోరిడాలోని ఓ సినిమా హాల్ వద్ద జరిగింది. స్థానిక టెలివిజన్ కథనం ప్రకారం పాస్కో కౌంటీలో వెస్లీ చాపెల్ లోని సినిమా హాల్ లోపల కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో గాయపడిన ఇద్దర్ని టాంపా బే ప్రాంతంలోని ఆస్పత్రికి హెలికాప్టర్ లో తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాల్పులు జరిపిన అగంతకుడ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement