టెక్నాలజీనా.. మజాకా!

టెక్నాలజీనా.. మజాకా! - Sakshi

- వాట్పాప్‌లో కీలాడీల మట్కా నిర్వహణ

- టెక్నాలజీ సాయంతో ఛేధించిన పోలీసులు

- ఆరుగురి అరెస్టు.. భారీగా నగదు స్వాదీనం

 

తాడిపత్రిరూరల్‌: కొత్త పుంతులు తొక్కుతున్న టెక్నాలజీని కొంతమంది కీలాడీలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. మామూలుగా వాట్సాప్‌లో ఫోటోస్‌, వీడియోలు షేర్‌ చేసుకుంటారు. కానీ కొంతమంది ఒక అడుగు ముందుకేసి వాట్సాప్‌ మెసెజ్‌లతో మట్కా  నిర్వహించారు. రూరల్‌ పోలీసులు టెక్నాలజీతో ఛేధించి నిర్వాహకునితో పాటు ఆరు మందిని అరెస్టు చేసి రూ.3,00,200లు నగదు, మూడు సెల్‌ ఫోన్లను స్వాదీనం చేసుకున్నాట్లు తాడిపత్రి డిఎస్పీ చిదానందరెడ్డి శుక్రవారం వెల్లడించారు. 

 

పట్టణంలోని రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత నెల రోజులుగా మా సిబ్బంది నిర్వాహకులు ఆశోక్‌రెడ్డి పై నిఘా ఉంచి సెల్‌ఫోన్‌లలో వాట్సాప్‌ మెసెజ్‌లతో మట్కా నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు. ఆశోక్‌రెడ్డి వైడికె అనే వాట్సాప్‌ గ్రూపును క్రియేట్‌ చేసుకుని మట్కా పట్టీలను మెసెజ్‌ద్వారా పోందుతూ నిర్వహిస్తున్నారు. సి.ఐ., ఎస్‌.ఐ.లు టెక్నాలజీని వినియోగించి వాట్సాప్‌ మెసెజ్‌లతో మట్కాను నిర్వహిస్తున్నట్లు గుర్తించి నిర్వాహకులు ఆశోక్‌రెడ్డి ఇంటి వద్ద దాడులు చేశారు. 

 

మట్కా నిర్వాహకుడుతో పాటు శివసంజీవరాయుడు యాడికి మండలానికి చెందిన అనంతయ్య, శివ, చింతప్రకాష్, సుధాకర్, రామాంజనేయులను పట్టుకుని నగదు, సెల్‌ఫోన్లను స్వాదీనం చేసుకున్నరని తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించి మట్కా నిర్వాహకులను అరెస్టు చేయడంపై సి.ఐ., ఎస్‌.ఐ., సిబ్బంది రాజా, కిశోర్‌లను డిఎస్పీ అభినందించారు.  ఆయన  అక్రమ ఇసుక రవాణాపై గట్టి నిఘా ఉంచామని అక్రమంగా ఇసుకను తరలిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. జూదం, మట్కాల నిర్మూలనకు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ అన్నారు. 

 
Read latest Top Stories News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top