వైఎస్సే.. మా లీడర్ | ys rajasekhara reddy our leader, says engineering students | Sakshi
Sakshi News home page

వైఎస్సే.. మా లీడర్

Sep 15 2013 4:26 AM | Updated on Jul 7 2018 2:52 PM

ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం ద్వారా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తమ హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారని పలు కళాశాలల విద్యార్థులు వెల్లడించారు.

విద్యార్థులు ఏర్పాటుచేసిన స్టాల్‌లో వైఎస్సార్ ఫోటోతో ఉన్న బోర్డు
 ఫీజు రీయింబర్స్‌మెంట్  పథకం ద్వారా దివంగత ముఖ్యమంత్రివైఎస్ రాజశేఖరరెడ్డి తమ హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్నారని పలు కళాశాలల విద్యార్థుల వెల్లడించారు. ఎపికీ తమ అభిమాన రాజకీయ నాయకుడు ఆయనేనని ఓటు ద్వారా స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో శుక్ర, శనివారాల్లో ‘ఎక్స్‌బెరంజా 2కే13’ పేరుతో జాతీయ స్థార టెక్నో ఫెస్ట్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ టెక్నో ఫెస్ట్ రాష్ట్రంలోని సుమారు 50 కళాశాలలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులు తాము రూపొందించిన ఎగ్జిబిట్స్‌ను ఇందులో ప్రదర్శిస్తున్నారు.
  అయితే ఎప్పడూ విభిన్నంగా ఆలోచించే విద్యార్థులు టెక్నోఫెస్ట్‌లో ఏర్పాటు చేసిన ఓ స్టాల్ అందరినీ ఆకట్టుకుంది. ఒక బోర్డపై వైఎస్ రాజశేఖరరెడ్డి, నందమూరి తారక రామారావు, కేసీఆర్‌చిత్ర పటాలను ఏర్పాటు చేసి.. మీ అభిమాన నాయకుడికి ఓటు వేయాలంటూ ఫెస్ట్‌కు వచ్చిన విద్యార్థలకు ఓటింగ్ పెట్టారు. వెయ్యి మందికిపైగా విద్యార్థులు ఈ ఓటింగ్‌లో పాలొన్నారు.  ఇందులో వైఎస్సార్‌కు 635 ఓట్లు రాగా, ఎన్టీఆర్‌కు 325, కేసీఆర్‌కు 150 ఓట్లు వచ్చాయి. తమ కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్  పథకాన్ని ఏర్పాటు చేసి ఉన్నత చదువులు అభ్యసించడానికి వైఎస్సార్ కృషి చేశారని ఈ సందర్భంగా పలువురు విద్యార్థలు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement