ఢిల్లీ వీధుల్లో సమైక్య సమరం : పార్లమెంటు స్ట్రీట్ వద్ద జగన్ అరెస్ట్ | YS Jagan Arrest at Parliament street | Sakshi
Sakshi News home page

ఢిల్లీ వీధుల్లో సమైక్య సమరం:పార్లమెంటు స్ట్రీట్ వద్ద జగన్ అరెస్ట్

Feb 17 2014 5:33 PM | Updated on Jul 25 2018 4:07 PM

ఢిల్లీ వీధుల్లో సమైక్య సమరం : పార్లమెంటు స్ట్రీట్ వద్ద జగన్ అరెస్ట్ - Sakshi

ఢిల్లీ వీధుల్లో సమైక్య సమరం : పార్లమెంటు స్ట్రీట్ వద్ద జగన్ అరెస్ట్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని పార్లమెంటు స్ట్రీట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు.

ఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డిని పార్లమెంటు స్ట్రీట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. పార్లమెంటు స్ట్రీట్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. జంతర్ మంతర్ వద్ద ఆ పార్టీ చేపట్టిన సమైక్య ధర్నా కార్యక్రమంలో జగన్ ప్రసంగం ముగిసిన తరువాత కాలినడకన పార్లమెంటుకు బయలు దేరారు. ఎక్కడ వరకు అనుమతిస్తే అక్కడ వరకు వెళదామని జగన్ పిలుపు ఇవ్వడంతో ధర్నాలో పాల్గొన్న కార్యకర్తలు అందరూ ఆయన వెంట నడిచారు. ఢిల్లీ వీధుల్లో సమైక్య సమరం సాగింది.

ఢిల్లీ వీధులన్నీ సమైక్య నినాదాలతో దద్దరిల్లాయి. కేంద్రానికి, సోనియా గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమైక్యవాదులు పార్లమెంటు స్ట్రీట్ వద్దకు చేరుకునే సరికి పోలీసులు వారిని అడ్డుకున్నారు. దాంతో వైఎస్ఆర్ సిపి నాయకులు అక్కడే కింద కూర్చున్నారు.  భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. పోలీసులు వాటర్ క్యాన్లు, బాష్పవాయువులు సిద్ధం చేశారు. కార్యకర్తలను అడ్డుకోవడంతో  పోలీసులకు, జగన్కు మధ్యలో వాగ్వాదం జరిగింది. ఆ తరువాత పోలీసులు జగన్ను అరెస్ట్ చేశారు. జగన్ తోపాటు పలువురు పార్టీ నేతలకు కూడా పో్లీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement