మైనర్పై అత్యాచారం:నిందితుని 10 ఏళ్ల జైలు శిక్ష | Youth gets 10 yrs in jail for raping minor girl | Sakshi
Sakshi News home page

మైనర్పై అత్యాచారం:నిందితుని 10 ఏళ్ల జైలు శిక్ష

Oct 26 2013 1:31 PM | Updated on Jul 28 2018 8:35 PM

మైనర్ బాలిక కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారం చేసిన నిందితుడు రాజుకు 10 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ అడిషినల్ జిల్లా సెషన్స్ జడ్జి తీర్పు వెలువరించారు.

మైనర్ బాలిక కిడ్నాప్ చేసి ఆపై అత్యాచారం చేసిన నిందితుడు రాజు (26)కు 10 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ అడిషినల్ జిల్లా సెషన్స్ జడ్జి చంద్ర భూషణ్ సింగ్ తీర్పు వెలువరించారు. దానితోపాటు నిందితుడికి రూ. 45 వేల జరిమాన విధించారు. పోలీసుల కథనం ప్రకారం... ఉత్తరప్రదేశ్లోని షామిల్ జిల్లాలో గతేడాది ఫిబ్రవరిలో మైనర్ బాలిక ఆచూకీ తెలియకుండా పోయింది.

 

దాంతో తమ కుమార్తె ఆచూకీ తెలపాలంటూ మైనర్ బాలిక తల్లితండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా మూడు నెలల అనంతరం ఆ మైనర్ బాలికను పోలీసుల కనుగొన్నారు. ఆ బాలిక పోలీసులకు జరిగిన విషయాన్ని వివరించింది. దాంతో నిందితుని పోలీసుల కేసు నమోదు చేసి, గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. దీంతో నిందితుడు రాజుకు శిక్షను ఖరారు చేస్తు జడ్జి తీర్పు వెలువరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement