వద్దంటే.. కోట్లు వచ్చాయి | Woman wins $1 million trying to teach husband | Sakshi
Sakshi News home page

వద్దంటే.. కోట్లు వచ్చాయి

Nov 2 2016 10:05 AM | Updated on Sep 4 2017 6:59 PM

వద్దంటే.. కోట్లు వచ్చాయి

వద్దంటే.. కోట్లు వచ్చాయి

భర్తతో గొడవపడటం వల్ల లీసెస్టర్కు చెందిన గ్లెండా బ్లాక్వెల్కు ఇలా అదృష్టం కలసి వచ్చింది.

అమెరికాలో నార్త్ కరోలినాకు చెందిన ఓ మహిళ ఎప్పుడూ భర్తతో గొడవ పెట్టుకునేది. భర్త లాటరీ టికెట్లు కొని డబ్బు వృథా చేస్తున్నాడన్నది ఆమె వాదన. భర్త తీరు చూసి విసిగిపోయిన ఆమె తగిన గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకుంది. భర్త కోరిక మేరకు ఆమె కొన్ని లాటరీ టికెట్లు కొని ఇచ్చింది. వీటి వల్ల డబ్బు దండగే తప్ప, లాభం ఉండదని చెప్పింది. అయితే ఆమె ఊహించనిది జరిగింది.  ఆమె కోరుకోకున్నా లాటరీ తగిలింది. లాటరీలో 6.68 కోట్ల రూపాయలు వచ్చాయి. భర్తతో గొడవపడటం వల్ల లీసెస్టర్కు చెందిన గ్లెండా బ్లాక్వెల్కు ఇలా అదృష్టం కలసి వచ్చింది. డబ్బులు వృథా చేస్తున్నావంటూ తన భర్తను చాలాసార్లు కోప్పడ్డానని, ఇకపై అలా మాట్లాడనని చెప్పింది. లాటరీ తగిలినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది.

లాటరీ డబ్బుతో ఓ ఇల్లు, కొంత భూమి కొనుగోలు చేస్తామని బ్లాక్వెల్ చెప్పింది. కూతురికి సాయం చేస్తామని, కాలేజీలో చదువుకుంటున్న ఇద్దరు మనవరాళ్ల కోసం కొంత డబ్బు కేటాయిస్తామని భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement