వందల కోట్ల లాటరీ..

Scottish couple win £58m lottery jackpot despite ripped up ticket - Sakshi

ఏదైనా వస్తువు కనబడకుండా పోయి.. తిరిగి దొరికితే మనంత అదృష్టవంతులు లేరనుకుంటాం. అదే వందల కోట్ల లాటరీ తగిలి.. ఆ టికెట్‌ పోయి.. తర్వాత దొరికితే ఎలా ఉంటుంది చెప్పండి? ఆ ఆనందానికి అవధులు లేకుండా పోతుంది కదా.. అలాంటి అద్భుతమే జరిగింది స్కాట్లాండ్‌లో. అబెర్‌డీన్‌ షైర్‌కు చెందిన దంపతులైన 57 ఏళ్ల ఫ్రెడ్, 67 ఏళ్ల లెస్లీ హిగిన్స్‌లు ‘లైఫ్‌ చేంజింగ్‌’ లాటరీ టికెట్‌ను కొనుక్కున్నారు. డ్రాలో తమ నంబర్‌ వచ్చిందో లేదోనని కనుక్కునేందుకు స్థానికంగా ఉండే లాటరీ కార్యాలయా నికి వెళ్లారు. 

అయితే లాటరీ  వారికి రాలేదని ఆ టికెట్‌ను అక్కడి సిబ్బందిలో ఒకరు చించి చెత్త బుట్టలో వేశాడు. సిబ్బంది సరిగా చూడకుండానే ఆ లాటరీ టికెట్‌ చించిపడేశారనీ ఆరోపిస్తూ సహాయ కేంద్రంలో విచారణ కోరారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి అతడి నంబర్‌ను ఎలాగోలా కనుక్కొన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే తీసిన డ్రాలో హిగిన్స్‌ నంబర్‌ ఉందని తేలింది. దీంతో చెత్తబుట్టను మొత్తం వెతికించి అతడి టికెట్‌ను తిరిగిచ్చేశారు. ఇంతకీ ఆ టికెట్‌కు తగిలిన లాటరీ మొత్తం ఎంతో తెలుసా..! అక్షరాలా రూ.461 కోట్లు. జీవితంలో చూడనంత మొత్తాన్ని గెలుచుకోవడంతో ఆ దంపతులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిపోతున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top