రూ. 12 లక్షలకు టోకరా.. రెండేళ్ల జైలు శిక్ష | woman sentenced to two year prison cheating Rs 12 lakhs | Sakshi
Sakshi News home page

రూ. 12 లక్షలకు టోకరా.. రెండేళ్ల జైలు శిక్ష

Aug 4 2015 10:17 PM | Updated on Sep 3 2017 6:46 AM

చిట్టీల పేరుతో మోసం చేసి రూ.12లక్షలతో పరారైన కేసులో ఓ మహిళకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కొత్తపేట మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు నిచ్చింది.

తూర్పుగోదావరి(రావులపాలెం): చిట్టీల పేరుతో మోసం చేసి రూ.12లక్షలతో పరారైన కేసులో ఓ మహిళకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ కొత్తపేట మేజిస్ట్రేట్ కోర్టు తీర్పు నిచ్చింది. 2009లో మండలంలోని వోగులంక గ్రామానికి చెందిన ప్యాతిలి గంగామణి అనే మహిళ ఆ గ్రామంలో చిట్టీల పేరుతో రూ. 12 లక్షలు వసూలు చేసి పరారు అయింది.

దీంతో భాధితులు కోర్టుకెక్కారు. పోలీసులు నింధితురాలిని అదుపులోకి తీసుకున్ని కోర్టుకు రిమాండ్ చేశారు. అయితే కోర్టు మంగళవారం గంగామణికి రెండేళ్ల జైలు శిక్షతో పాటు పదివేలు జరిమానా విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement