చీటీల కేసులో తండ్రీకొడుకులు అరెస్ట్‌ | chitties case.. father, son arrest | Sakshi
Sakshi News home page

చీటీల కేసులో తండ్రీకొడుకులు అరెస్ట్‌

Nov 10 2016 2:05 AM | Updated on Aug 20 2018 4:27 PM

ఉంగుటూరు : చీటీల పేరుతో మోసగించిన తండ్రీకొడుకులను బుధవారం అరెస్ట్‌ చేసినట్టు ఎస్‌ఐ చావా సురేష్‌ తెలిపారు.

ఉంగుటూరు : చీటీల పేరుతో మోసగించిన తండ్రీకొడుకులను బుధవారం అరెస్ట్‌ చేసినట్టు ఎస్‌ఐ చావా సురేష్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. ఉంగుటూరుకు చెందిన అడపాప్రసాద్, రాంబాబు తండ్రీకొడుకులు. వీరు చీటీలు నిర్వహించి పాడుకున్నవారికి డబ్బులు చెల్లించలేదు. వీరి బారిన పడిన బాధితులు సుమారు 200 మంది ఉన్నారు. వారి ఫిర్యాదు మేరకు ప్రసాద్, రాంబాబును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత తాడేపల్లిగూడెం కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి నిందితులకు రిమాండ్‌ విధించారని ఎస్‌ఐ వెల్లడించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement