సెట్‌టాప్ బాక్స్ అప్‌డేట్ చేయాలని వచ్చి... | woman raped on pretext of updating set top box | Sakshi
Sakshi News home page

సెట్‌టాప్ బాక్స్ అప్‌డేట్ చేయాలని వచ్చి...

Feb 24 2016 12:41 PM | Updated on Sep 3 2017 6:20 PM

సెట్‌టాప్ బాక్స్ అప్‌డేట్ చేయాలని వచ్చి...

సెట్‌టాప్ బాక్స్ అప్‌డేట్ చేయాలని వచ్చి...

డీటీహెచ్ కంపెనీకి చెందిన ఉద్యోగి.. మీ ఇంట్లో సెట్‌టాప్ బాక్సును అప్‌డేట్ చేయాలంటూ వచ్చి మహిళపై అత్యాచారం చేశాడు.

డీటీహెచ్ కంపెనీకి చెందిన ఉద్యోగి.. మీ ఇంట్లో సెట్‌టాప్ బాక్సును అప్‌డేట్ చేయాలంటూ వచ్చి మహిళపై అత్యాచారం చేశాడు. అతడిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. మునిరెడ్డి అనే వ్యక్తి ఓ డీటీహెచ్ సంస్థలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. గత వారం ఓ ఇంట్లో సెట్ టాప్ బాక్సు రిపేరు వచ్చిందని కంప్లయింట్ రావడంతో.. అక్కడకు వెళ్లినప్పుడు ఇంట్లో మహిళ ఒక్కరే ఉంటున్నట్లు గుర్తించాడు.

దాంతో మరోసారి ఆ ఇంటికి వెళ్లి, సెట్ టాప్ బాక్సును అప్‌డేట్ చేయడానికి వచ్చానని చెప్పాడు. ఇంట్లో ఎవరూ లేరన్న విషయాన్ని నిర్ధారించుకుని, ఆమెపై అత్యాచారం చేశాడు. బాధితురాలు అరవడంతో మునిరెడ్డి అక్కడి నుంచి పారిపోయాడు. తర్వాత బాధితురాలు ఈ విషయాన్ని తన బంధువులకు చెప్పగా, వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో బెంగళూరుకు సమీపంలో ఉన్న ఓ గ్రామంలో ఉన్న మునిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement