పాపం చికిత్సకు వెళితే.. గ్యాంగ్ రేప్ చేశారు | Woman raped in hospital by ward boy, guard | Sakshi
Sakshi News home page

పాపం చికిత్సకు వెళితే.. గ్యాంగ్ రేప్ చేశారు

Jun 8 2016 9:15 AM | Updated on Sep 4 2017 2:00 AM

పాపం చికిత్సకు వెళితే.. గ్యాంగ్ రేప్ చేశారు

పాపం చికిత్సకు వెళితే.. గ్యాంగ్ రేప్ చేశారు

డిప్రెషన్తో బాధపడుతున్న ఓ మహిళ (22) చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా.. వార్డు బాయ్, గార్డు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.

గుర్గావ్: ఢిల్లీ శివారు ప్రాంతంలో దారుణం జరిగింది. డిప్రెషన్తో బాధపడుతున్న ఓ మహిళ (22) చికిత్స కోసం ఆస్పత్రికి వెళ్లగా.. వార్డు బాయ్, గార్డు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు.

మేవాత్లోని ఎస్హెచ్కేఎమ్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్పత్రి ఐదో అంతస్తు 17 వార్డులో చికిత్స పొందుతున్న బాధితురాలిని బయటకు రమ్మని వార్డు బాయ్ పిలిచాడు. ఆమె వార్డు బయటకు వచ్చి తన బంధువులు ఉన్న లాంజ్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా, వార్డు బాయ్ ఖాళీగా ఉన్న ఓ రూమ్లోకి ఆమెను బలవంతంగా లాక్కెళ్లాడు. అక్కడ విధులు నిర్వహిస్తున్న గార్డు కూడా ఆ రూమ్లోకి వెళ్లాడు. ఇద్దరూ కలసి ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డారు.

కాసేపటి తర్వాత వార్డులో బాధితురాలు లేని విషయాన్ని ఆమె బంధువు గుర్తించాడు. నిందితులు బాధితురాలిని తీసుకెళ్లిన రూమ్ బయట ఆమె వస్తువులు పడిఉన్న విషయాన్ని గుర్తించి అలారమ్ మోగించాడు. దీంతో వార్డు బాయ్, గార్డు అక్కడి నుంచి పారిపోయారు. నిందితులను గుర్తించామని, వారిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. నిందితులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఇది చాలా దారుణమైన ఘటన అని, నిందితులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని, విచారణకు పూర్తిగా సహకరిస్తామని ఆస్పత్రి డైరక్టర్ శన్సర్చంద్ శర్మ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement