రేప్‌ చేసి, వీడియోలు బయటపెడతానని.. | Woman Blackmailed, Raped Multiple Times in Kolkata For Nearly a Year | Sakshi
Sakshi News home page

రేప్‌ చేసి, వీడియోలు బయటపెడతానని..

Apr 5 2017 12:53 PM | Updated on Sep 5 2017 8:01 AM

రేప్‌ చేసి, వీడియోలు బయటపెడతానని..

రేప్‌ చేసి, వీడియోలు బయటపెడతానని..

ఉన్నత చదువుల కోసం ఒడిశా నుంచి కోల్‌కతా వెళ్లిన ఓ పెళ్లికాని మహిళ(30)పై ఓ వ్యాపారవేత్త దారుణానికి తెగబడ్డాడు. ఓ పార్టీలో కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా పరిచయమైన ఆ వ్యక్తి ఆమె పారిట శాపంలా మారాడు.

కోల్‌కతా: ఉన్నత చదువుల కోసం ఒడిశా నుంచి కోల్‌కతా వెళ్లిన ఓ పెళ్లికాని మహిళ(30)పై ఓ వ్యాపారవేత్త దారుణానికి తెగబడ్డాడు. ఓ పార్టీలో కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా పరిచయమైన ఆ వ్యక్తి ఆమె పారిట శాపంలా మారాడు. దాదాపు ఏడాదిపాటు లైంగికి దాడికి పాల్పడ్డాడు. రెండు సార్లు అబార్షన్‌ కూడా చేయించాడు. క్రమంగా అతడి వేధింపులు మరింత ఎక్కువకావడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా వారు నిందితుడిని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..ఒడిశాకు చెందిన 30 ఏళ్ల మహిళ కోల్‌కతాలో ఉండి చదువుకుంటోంది. తన స్నేహితురాళ్లతో కలిసి జోద్‌పూర్‌ గార్డెన్స్‌లో ఓ ఫంక్షన్‌కు వెళ్లింది.

ఆ పార్టీలోనే రాకేశ్‌ చౌదరీ, ఆయన భార్య ఆమెకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత ఒకసారి పార్టీకి రావాలంటూ ఆహ్వానించిన రాకేశ్‌ ఆమెకు మత్తుమందు కలిపిన కూల్‌ డ్రింక్స్‌ ఇచ్చాడు. ఆ తర్వాత బాధితురాలిని కోల్‌కతాలోని బైపాస్‌ రోడ్డులో ఉన్న తన గెస్ట్‌హౌజ్‌కి తీసుకెళ్లాడు. పూర్తిగా మద్యం తాగించి స్పృహకోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ క్రమంలో ఫొటోలు, వీడియోలు తీశాడు. తర్వాత తాను పిలిచిన ప్రతిసారి రాకుంటే ఫొటోలు బయటపెడతానని బెదరించి ఏడాదిపాటు దుర్మార్గానికి పాల్పడ్డాడు. రెండుసార్లు గర్భస్రావం చేయించాడు. ఆ తర్వాత కూడా అతడు వేధింపుల స్థాయి పెంచడంతో భరించలేని బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెను వైద్య పరీక్షలకు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement