బలవంతంగా మద్యం తాగించి గ్యాంగ్ రేప్ | Woman gangraped in Chhattisgarh | Sakshi
Sakshi News home page

బలవంతంగా మద్యం తాగించి గ్యాంగ్ రేప్

Aug 13 2014 1:22 PM | Updated on Sep 2 2017 11:50 AM

బలవంతంగా మద్యం తాగించి గ్యాంగ్ రేప్

బలవంతంగా మద్యం తాగించి గ్యాంగ్ రేప్

వివాహిత(26)పై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

బిలాస్పూర్: వివాహిత(26)పై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఛత్తీస్గఢ్ లోని బిలాస్పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. బిస్లరీ గ్రామానికి సమీపంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.

బిలాస్పూర్ చెందిన బాధితురాలు జానక్పూర్ లోని తన స్నేహితురాలి దగ్గరికి వెళ్లి తిరిగి వస్తుండగా రెండు బైకులపై వచ్చిన నలుగురు దుండగులు లిఫ్ట్ ఇస్తామని ఆమెను తమ వాహనం ఎక్కించుకున్నారు. తర్వాత నిర్మానుష్య ప్రాంతంలోని కాలువలోకి తీసుకెళ్లి, ఆమెతో బలవంతంగా మద్యం తాగించి సామూహిక అత్యాచారం చేశారని బిలాస్పూర్ ఏఎస్పీ జేఆర్ థాకూర్ తెలిపారు.

అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను అక్కడే వదిలేసి పరారయ్యారు. స్థానికులు ఆమెను గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది. దుండగులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement