భర్తను కొట్టి.. భార్యపై గ్యాంగ్రేప్ | Woman gang raped, husband beaten by 7 person | Sakshi
Sakshi News home page

భర్తను కొట్టి.. భార్యపై గ్యాంగ్రేప్

Oct 16 2015 3:48 PM | Updated on Sep 3 2017 11:04 AM

భర్తను కొట్టి.. భార్యపై గ్యాంగ్రేప్

భర్తను కొట్టి.. భార్యపై గ్యాంగ్రేప్

అసోంలో ఏడుగురు దుండగులు నవదంపతులపై దాడి చేసి అమానుషంగా ప్రవర్తించారు.

రాంగియా: అసోంలో ఏడుగురు దుండగులు నవదంపతులపై దాడి చేసి అమానుషంగా ప్రవర్తించారు. భర్తను విచక్షణరహితంగా కొట్టి.. భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కంరూప్ జిల్లాలో ఈ విషాదకర ఘటన జరిగింది.

గురువారం సాయంత్రం బక్సా జిల్లాకు చెందిన యువతి, తన భర్తతో కలసి కంరూప్ జిల్లా కెకెనికుచి ప్రాంతంలోని తన బంధువుల ఇంటికి వెళ్లేందుకు వచ్చింది. దారిలో ఏడుగురు దుండగులు వీరిపై దాడి చేశారు. భర్తను తీవ్రంగా కొట్టి, భార్యను సమీప అటవీప్రాంతంలోకి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement