తల్లీకూతుళ్లపై యాసిడ్ దాడి | Woman, daughter injured in acid attack | Sakshi
Sakshi News home page

తల్లీకూతుళ్లపై యాసిడ్ దాడి

Nov 8 2013 3:17 PM | Updated on Aug 17 2018 2:10 PM

ఉత్తరప్రదేశ్ జన్పూర్ జిల్లాలోని మచిలీగాం గ్రామంలో తల్లీకూతుళ్లపై ఆగంతంకులు యాసిడి దాడి చేశారని బద్లాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శుక్రవారం వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్ జన్పూర్ జిల్లాలోని మచిలీగాం గ్రామంలో తల్లీకూతుళ్లపై ఆగంతంకులు యాసిడి దాడి చేశారని బద్లాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శుక్రవారం వెల్లడించారు. గత రాత్రి ఇంట్లో తల్లీ చంపా (56), కుమార్తె మాధురి (21) నిద్రిస్తున్న సమయంలో ఆగంతకులు ఆ దాడి చేశారని, అయితే ఆ దాడిలో వారిద్దరికి తీవ్ర గాయాలపాలైయ్యారని తెలిపారు. దాంతో వారిని హుటాహుటిన వారణాసిలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement