'బూటకపు స్వాతంత్య్ర దినంగా పాటించాలి' | we should make as Pseudo independence day, calls maoists | Sakshi
Sakshi News home page

'బూటకపు స్వాతంత్య్ర దినంగా పాటించాలి'

Aug 12 2015 4:09 PM | Updated on Aug 13 2018 7:43 PM

సీపీఐ మావోయిస్టు ఖమ్మం జిల్లా కమిటీ పేరుతో పోస్టర్లు ఖమ్మం జిల్లా చర్ల మండలంలో రహదారిపై బుధవారం దర్శనమిచ్చాయి.

చర్ల (ఖమ్మం): సీపీఐ మావోయిస్టు ఖమ్మం జిల్లా కమిటీ పేరుతో పోస్టర్లు ఖమ్మం జిల్లా చర్ల మండలంలో రహదారిపై బుధవారం దర్శనమిచ్చాయి. ప్రజలకు ఇంకా పూర్తి స్వాతంత్య్రం రాలేదని, ఆగస్ట్ 15ను బూటకపు స్వాతంత్య్ర దినంగా పాటించాలని మావోయిస్టులు ఆ ప్రకటనలో ప్రజలకు పిలుపునిచ్చారు.

ఆదివాసీలపై అధికంగా అత్యాచారాలు జరుగుతున్నాయని, పీడిత ప్రజలైన ఆదివాసీలకు ఇంకా పూర్తి హక్కులు రాలేదని పేర్కొన్నారు. బ్రిటిష్ వారి నుంచి రాజ్యాధికారం బదిలీ అయినా, పెట్టుబడి, భూస్వామ్య వర్గాల చేతుల్లో పరిమితమైందన్నారు. భారతదేశంలో ఇంకా అన్ని వర్గాలు, ప్రజలకు స్వాతంత్య్రం రానప్పుడు... స్వాతంత్యదినం అని ఎలా అంటారని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement