బూడిద దెబ్బకు ఎక్కడి విమానాలు అక్కడే | Volcanic ash shuts four Indonesian airports | Sakshi
Sakshi News home page

బూడిద దెబ్బకు ఎక్కడి విమానాలు అక్కడే

Jul 10 2015 10:14 AM | Updated on Sep 3 2017 5:15 AM

బూడిద దెబ్బకు ఎక్కడి విమానాలు అక్కడే

బూడిద దెబ్బకు ఎక్కడి విమానాలు అక్కడే

ఇండోనేషియాలోని పశ్చిమ జావాలో శుక్రవారం అగ్నిపర్వతం బద్దలైంది.

జకార్తా: ఇండోనేషియాలోని తూర్పు జావాలో శుక్రవారం అగ్నిపర్వతం బద్దలైంది. అందులో నుంచి బారీగా బూడిద ఎగచిమ్ముతోంది. ఈ నేపథ్యంలో బాలి, లంబాక్, బన్యూవాంగి, జంబర్ ఎయిర్పోర్ట్లను మూసివేసినట్లు ఇండోనేసియా ఎయిర్లైన్స్ శుక్రవారం ట్విట్ చేశారు. ఈ విమానాశ్రయాల మూసివేత ఈ రోజు రాత్రి 10.00 గంటల వరకు కొనసాగుతుందని చెప్పారు.

ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని ఎయిర్లైన్స్ ఉన్నతాధికారులు వెల్లడించారు. అయితే దేశంలోని మిగిలిన ఎయిర్పోర్ట్ల నుంచి విమాన సర్వీసులు సజావుగా సాగుతున్నాయని తెలిపారు. జావా ద్వీపంలోని మౌంట్ రౌంగ్ అగ్నిపర్వతం విస్పోటం నేపథ్యంలో జులై 2వ తేదీ నుంచి ఆస్ట్రేలియాకు విమానాలను రద్దు చేసినట్లు చెప్పారు.

Advertisement
Advertisement