'ఆన్ లైన్ లో పైరసీ సినిమాలు చూడడం తప్పు కాదు' | Viewing pirated films online not an offence: Bombay HC | Sakshi
Sakshi News home page

'ఆన్ లైన్ లో పైరసీ సినిమాలు చూడడం తప్పు కాదు'

Sep 5 2016 8:51 AM | Updated on Sep 4 2017 12:25 PM

'ఆన్ లైన్ లో పైరసీ సినిమాలు చూడడం తప్పు కాదు'

'ఆన్ లైన్ లో పైరసీ సినిమాలు చూడడం తప్పు కాదు'

ఆన్ లైన్ లో పైరసీ సినిమాలు చూడటం శిక్షార్హం కాదని బొంబాయి హైకోర్టు తీర్పునిచ్చింది.

ముంబై: ఆన్ లైన్ లో పైరసీ సినిమాలు చూడటం శిక్షార్హం కాదని బొంబాయి హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసును విచారించిన జస్టిస్ గౌతమ్ పటేల్ కాపీ రైట్ యాక్టు కింద పైరసీ సినిమాలను ఆన్ లైన్ లో వీక్షించిన వారు శిక్షార్హులు అని ఉన్న క్లాజ్ సరిగా లేదని వ్యాఖ్యానించారు. ఆన్ లైన్ లో సినిమాలు చూడటం తప్పు కాదని, అనుమతి లేకుండా ఆన్ లైన్ లో సమాచారాన్ని ఉంచడం శిక్షార్హం అని పేర్కొన్నారు.

ఆన్ లైన్ లో సినిమాలు చూడటం, డౌన్ లౌడ్ చేయడం, డూప్లికేట్ చేయడం లాంటి పదాలను కాపీరైట్ యాక్టు నుంచి తొలగించాలని ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్ల(ఐఎస్పీ)ను కోర్టు కోరింది. ఇందుకు బదులుగా వెబ్ సైట్ యూఆర్ఎల్ లలో నిబంధనలు పాటించని సైట్లను బ్లాక్ చేస్తామనే మెసేజ్ ను ఉంచాలని తెలిపింది. దీంతో పాటు పైరసీ ప్రింట్లను అందుబాటులో ఉంచుతున్న సైట్లను బ్లాక్ చేసి 'ఎర్రర్ మెసేజ్' ఫోటోను ఉంచాలని పేర్కొంది. గత నెలలో పైరసీ ప్రింట్లను ఆన్ లైన్ లో వీక్షించిన వారు శిక్షార్హులని ఐఎస్పీలు ప్రకటించడంతో పైరసీ ప్రియులు షాక్ తిన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement