'కావాలనే రద్దు చేయించారు' | vangaveeti radha krishna slams chandrababu over special status issue | Sakshi
Sakshi News home page

'కావాలనే రద్దు చేయించారు'

Sep 14 2015 3:20 PM | Updated on Mar 23 2019 9:10 PM

'కావాలనే రద్దు చేయించారు' - Sakshi

'కావాలనే రద్దు చేయించారు'

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అవసరమని వైఎస్సార్ సీపీ నేత వంగవీటి రాధాకృష్ణ అన్నారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అవసరమని వైఎస్సార్ సీపీ నేత వంగవీటి రాధాకృష్ణ అన్నారు. ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా కాదు, ప్యాకేజీ కావాలని చంద్రబాబు అడుగుతున్నారని విమర్శించారు.

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో రేపు నిర్వహించనున్న సమావేశాన్ని కావాలనే చంద్రబాబు రద్దు చేయించారని ఆరోపించారు. ప్రత్యేక హోదాతొ కలిగే లాభాలను విద్యార్థులు, యువతకు తెలియజేయాలన్నదే వైఎస్ జగన్ ఉద్దేశమని తెలిపారు. చంద్రబాబు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రత్యేక హోదా ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళతామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement