గాలమేసి.. దోచేశారు! టీనేజ్ దొంగల 'స్మార్ట్' గేమ్! | US teens use smartphone game Pokemon Go to lure people to locations, rob them | Sakshi
Sakshi News home page

గాలమేసి.. దోచేశారు! టీనేజ్ దొంగల 'స్మార్ట్' గేమ్!

Jul 11 2016 6:23 PM | Updated on Nov 6 2018 5:26 PM

గాలమేసి.. దోచేశారు! టీనేజ్ దొంగల 'స్మార్ట్' గేమ్! - Sakshi

గాలమేసి.. దోచేశారు! టీనేజ్ దొంగల 'స్మార్ట్' గేమ్!

అమెరికాలో కుర్ర దొంగలు తెలివి మీరిపోయారు. మొబైల్ గేమ్ 'పోకేమ్యాన్ గో' తో గాలమేసి.. పలువురికి కుచ్చుటోపీ పెట్టారు.

అమెరికాలో కుర్ర దొంగలు తెలివి మీరిపోయారు. మొబైల్ గేమ్ 'పోకేమ్యాన్ గో' తో గాలమేసి.. పలువురికి కుచ్చుటోపీ పెట్టారు. 'పోకేమ్యాన్ గో' గేమ్ ద్వారా పరిచయమైన వారిని తెలివిగా ఓ నిర్మానుష ప్రాంతానికి రప్పించి వారిని నిలువుదోపిడీ చేసిన నలుగురు టీనేజ్ దొంగలను తాజాగా మిస్సోరి పోలీసులు అరెస్టు చేశారు.

తాజాగా విడుదలైన 'పోకేమ్యాన్ గో' గేమ్ కొత్త ఫీచర్లు అందుబాటులోకి తెచ్చింది. దానిప్రకారం ఈ గేమ్ ఆడేటప్పుడు పేర్కొనే ప్రాంతాలకు వెళ్లి బొమ్మలు సేకరించాలని నిర్దేశిస్తుంది. ఇలాంటి ప్రాంతాల్లో దారిచూపే గుర్తులు పెట్టి తెలివిగా వారిని బోల్తా కొట్టించిన ఈ నలుగురు దొంగలు.. తాము అనుకున్న నిర్మానుష్య ప్రాంతానికి బాధితులు రాగానే వారిని దోచేసేవారు.  బాధితుల ఫిర్యాదు ప్రకారం రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు దొంగలను అరెస్టు చేశారు. సెయింట్ లూయిస్ కు సమీపంలోని ఓఫాలన్ ప్రాంతానికి చెందిన ఈ నలుగురు నిందితుల వయస్సు 16 నుంచి 18 ఏళ్లు అని పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement