సీఎం సైకిల్ తొక్కారు.. మరి మీరో! | up cm akhilesh yadav poses on a cycle | Sakshi
Sakshi News home page

సీఎం సైకిల్ తొక్కారు.. మరి మీరో!

Sep 19 2015 8:13 PM | Updated on Sep 3 2017 9:38 AM

సీఎం సైకిల్ తొక్కారు.. మరి మీరో!

సీఎం సైకిల్ తొక్కారు.. మరి మీరో!

ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సైకిల్ తొక్కుకుంటూ రోడ్డు మీద వెళ్తే ఎలా ఉంటుంది?

ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సైకిల్ తొక్కుకుంటూ రోడ్డు మీద వెళ్తే ఎలా ఉంటుంది? భద్రతా పరమైన కారణాలతో పాటు.. అసలు సీఎం లాంటి వ్యక్తి అలా వెళ్తుంటే జనం ఫాలోయింగ్ ఎలా ఉంటుందన్న విషయం కూడా చూడాలి కదా. కానీ వీటన్నింటినీ తోసిరాజని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సైకిల్ తొక్కుకుంటూ లక్నో వీధుల్లో సందడి చేశారు. అది కూడా వెనకాల పెద్ద భద్రతా ఏర్పాట్లు ఏమీ లేకుండానే.

శ్రీమంతుడు సినిమాలో మహేశ్ బాబు తొక్కినట్లే ఓ అత్యాధునిక సైకిల్ తీసుకుని ఆయన తొక్కుకుంటూ వెళ్లిపోయారు.  మధ్యలో ఎవరో ఫొటోగ్రాఫర్ కనిపిస్తే ఫొటోకు పోజులు కూడా ఇచ్చారు. ఆరోగ్యం కోసం ఇలా సైకిల్ తొక్కడం మంచిదే. మరి సీఎం తొక్కినప్పుడు మనం ఎందుకు మొహమాట పడటం? మీరూ సైకిళ్లు తీయండి!!

Advertisement
 
Advertisement
Advertisement