'సాంస్కృతిక మంత్రి అనాగరిక వ్యాఖ్యలు' | Uncultured Statement of Culture Minister, says digvijaya singh | Sakshi
Sakshi News home page

'సాంస్కృతిక మంత్రి అనాగరిక వ్యాఖ్యలు'

Oct 13 2015 10:25 AM | Updated on Sep 3 2017 10:54 AM

'సాంస్కృతిక మంత్రి అనాగరిక వ్యాఖ్యలు'

'సాంస్కృతిక మంత్రి అనాగరిక వ్యాఖ్యలు'

కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

న్యూఢిల్లీ:  కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మహేశ్ శర్మ అహంకారంతో మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. సాంస్కృతిక శాఖ మంత్రి అనాగరిక వ్యాఖ్యలు చేస్తున్నారని ట్విటర్ లో మండిపడ్డారు.

కేంద్ర సాహిత్య అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నరచయితలపై తీరుపై అనుమానం కలుగుతోందని మహేష్ శర్మ అంతకుముందు వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తడంతో మంత్రి వివరణ ఇచ్చారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారు. రచయితలు తమ నిరసనను సరైన వేదిక ద్వారా తెలపాలని మాత్రమే తాను అన్నానని... రచనలు చేయడం, చేయకపోవడం వారి ఇష్టమని పేర్కొన్నారు.

సాహిత్య అవార్డు గ్రహీతలు వాటిని తమ దగ్గర ఉంచుకోవాలా, వద్దా అనేది వారి వ్యక్తిగత విషయమన్నారు. అవార్డులు వెనక్కు ఇచ్చేయడం ద్వారా నిరసన తెలపడం తానెన్నడూ చూడలేదని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement