ప్రైవేటు బస్సులో రూ.20 లక్షలతో పట్టుబడ్డ యువకుడు | Unaccounted money seized from Rajasthan youth | Sakshi
Sakshi News home page

ప్రైవేటు బస్సులో రూ.20 లక్షలతో పట్టుబడ్డ యువకుడు

Mar 10 2014 5:59 PM | Updated on Sep 2 2017 4:33 AM

ఓయువకుడు బస్సులో భారీ మొత్తంలో కరెన్సీని తీసుకువెళ్తూ పట్టుబడిన ఘటన కోయంబత్తూర్ లో సోమవారం చోటు చేసుకుంది.

కోయంబత్తూర్: ఓయువకుడు బస్సులో భారీ మొత్తంలో కరెన్సీని తీసుకువెళ్తూ  పట్టుబడిన ఘటన కోయంబత్తూర్ లో సోమవారం చోటు చేసుకుంది.  అనుమానస్పదంగా  ఓ సిటీ బస్సు ఎక్కిన రాజస్థాన్ కు చెందిన వికాస్ అనే యువకుడ్ని పోలీసులు సోదా చేయగా రూ.20 లక్షలు బయటపడ్డాయి. తొలుత అతని బ్యాగ్ లో  లభించిన రూ.15లక్షల భారీ మొత్తాన్ని చూసి పోలీసులు కంగుతిన్నారు. అనంతరం ఆ యువకుడు డ్రెస్ లోపలి భాగంలో కూడా  తనిఖీ చేయగా మరో రూ.5లక్షలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.

 

ఇదిలా ఉండగా కర్ణాటక రాష్ట్రంలో  బంగారు ఆభరణాలను అమ్మగా వచ్చిన కరెన్సీ తాను తీసుకువెళుతున్నట్లు ఆయువకుడు పోలీసులకు తెలిపాడు.

Advertisement
 
Advertisement
Advertisement