గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ | Two held in gangrape case | Sakshi
Sakshi News home page

గ్యాంగ్ రేప్ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్

Nov 1 2013 9:48 AM | Updated on Aug 25 2018 5:33 PM

టీనేజ్ యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఇద్దరు యువకులను హౌరా, కొల్కత్తా స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గత రాత్రి అరెస్ట్ చేసినట్లు పోలీసులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు.

టీనేజ్ యువతిపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన ఇద్దరు యువకులను హౌరా, కొల్కత్తా స్టేషన్ పరిసర ప్రాంతాల్లో గత రాత్రి అరెస్ట్ చేసినట్లు పోలీసులు శుక్రవారం ఇక్కడ వెల్లడించారు. వారిని కోర్టులో హారుపరుచగా న్యాయమూర్తి నిందితులకు రిమాండ్ విధించారని చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం... 24 పరిగణ జిల్లాలోని రాజర్ ప్రాంతంలో ప్రైవేట్ ఆసుపత్రిలో అత్యాచారానికి బాధితురాలు వైద్య సహాయకురాలిగా విధులు నిర్వర్తిస్తుందని తెలిపారు.

 

అయితే ఆ యవతి విధులు నిర్వహించిన అనంతరం నివాసం చేరుకునేందుకు బిదాన్ నగర్ రైల్వే స్టేషన్ చేరుకునేందుకు ప్రవేట్ వాహనం ఎక్కింది. ఆ వాహనం కొంత దూరం వెళ్లిన తర్వాత అప్పటికే ఆ వాహనంలో ఉన్న ఇద్దరు యువకులు ఆ యువతిపై డ్రైవర్ కళ్ల ఎదుటే సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు.

 

దాంతో ఆ యువతి సృహ కొల్పోయింది. సృహ వచ్చి చూసుకునే సరికి కొల్కత్తాలోని వ్యభిచార కేంద్రమైన సోనాగాచ్లోని గదిలో పడి ఉండటంతో ఆ యువతి పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. అందులో భాగంగా ఇద్దరు యువకులను పోలీసులు గత రాత్రి అరెస్ట్ చేశారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement