నటీ నటులపై దర్శకుడి యాసిడ్ దాడి | Two Bhojpuri film actors injured in acid attack | Sakshi
Sakshi News home page

నటీ నటులపై దర్శకుడి యాసిడ్ దాడి

Jul 28 2015 5:15 PM | Updated on Aug 17 2018 2:10 PM

నటీ నటులపై దర్శకుడి యాసిడ్ దాడి - Sakshi

నటీ నటులపై దర్శకుడి యాసిడ్ దాడి

భోజ్పురి సినిమా పరిశ్రమకు చెందిన ఇద్దరు నటీనటులపై యాసిడ్ దాడి జరిగింది.

భోజ్పురి సినిమా పరిశ్రమకు చెందిన ఇద్దరు నటీనటులపై యాసిడ్ దాడి జరిగింది. రూపాలి (20), వికాస్ (19) అనే ఇద్దరూ సినిమా షూటింగ్ కోసం వచ్చి ఓ కాలేజి ప్రాంగణంలో నిద్రపోతుండగా అజయ్ కుమార్ అనే సినీ దర్శకుడు వచ్చి వాళ్ల మీద యాసిడ్ పోసి అక్కడి నుంచి పారిపోయినట్లు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేసీ గోస్వామి తెలిపారు. వాళ్లిద్దరినీ వెంటనే సమీపంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అక్కడి నుంచి వారిని మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్ర ఆస్పత్రికి పంపారు.

ఇద్దరిలో రూపాలి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.  భోజ్పురి సినిమా రంగంలో దర్శకుడిగా ఉన్న అజయ్ కుమార్కు రూపాలిపై కోపం ఉన్నట్లు తెలుస్తోంది. తన ఇష్టానికి వ్యతిరేకంగా వికాస్తో కలిసి నటిస్తున్నందుకే ఆయనకు కోపం అని చెబుతున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement