గ్రేట్ దీపా.. దేశం నిన్ను చూసి గర్విస్తోంది!

గ్రేట్ దీపా.. దేశం నిన్ను చూసి గర్విస్తోంది!


రియో డి జెనీరో: యావత్ దేశం గతరాత్రి టీవీతెరకు కళ్లప్పగించింది. దీపా కర్మాకర్ ప్రమాదకరమైన విన్యాసం ప్రోడునోవా చేస్తుంటే.. గుండె చిక్కబట్టుకొని చూసింది. దీప అద్భుతమైన విన్యాసాలు చూసి చప్పట్లు కొట్టింది. అంతలోనే నిరాశ.. దీప ఎంత శాయశక్తులా కృషిచేసినా అదృష్టం కలిసిరాలేదు. తృటిలో ఒలింపిక్స్ పతకం చేజారింది. పతకం తేకపోయినా.. దీప మాత్రం దేశప్రజల హృదయాలను గెలుచుకుంది. ఒలింపిక్స్ వాల్ట్ విభాగంలో నాలుగోస్థానంలో నిలిచిన భారత జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఒలింపిక్స్ లో పాల్గొంటున్న తొలి భారత జిమ్నాస్ట్ గా ఇప్పటికే రికార్డు సృష్టించిన దీప.. తొలిప్రయత్నంలోనే ఫైనల్ కు చేరి దేశప్రజల్లో పతకంపై ఆశలు రేపింది. తుదివరకు అసమానమైన క్రీడాపటిమ కనబర్చిన దీపా కర్మాకర్ పతకాన్ని సాధించకున్నా.. భవిష్యత్తులో గొప్ప జిమాస్ట్ గా ఎదిగి దేశానికి ఎన్నో కీర్తి ప్రతిష్టలు తెస్తాననే ఆశాభావం కలిగించింది. ఆమె అసమాన పోరాటపటిమపై ట్విట్టర్ లో ప్రశంసల జల్లు కురుస్తోంది.దీపా కర్మాకర్ నిజమైన హీరో అని, అద్భుతమైన పోరాటపటిమను చూపిన ఆమెను చూసి దేశం గర్విస్తోందని నెటిజనులు హర్షం వ్యక్తం చేశారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్, షూటర్ అభినవ్ బింద్రా, వీరేంద్ర సెహ్వాగ్, హర్ష బోగ్లే, కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, రాజకీయ నాయకుడు అజయ్ మాకెన్ తోపాటు పలువురు నెటిజన్లు దీప క్రీడాప్రతిభను కొనియాడుతూ పెద్ద ఎత్తున ట్వీట్లు చేశారు.  

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top