సొరంగం చేసి బంగారం దుకాణంలో చోరీ | Tunnel To Gold Store In Theft | Sakshi
Sakshi News home page

సొరంగం చేసి బంగారం దుకాణంలో చోరీ

Sep 16 2015 3:34 AM | Updated on Sep 3 2017 9:27 AM

సొరంగం చేసి బంగారం దుకాణంలో చోరీ

సొరంగం చేసి బంగారం దుకాణంలో చోరీ

బంగారం దుకాణంలోకి సొరంగం ఏర్పాటు చేసి కొందరు దుండగులు చోరీకి పాల్పడ్డారు.

ఆరు కిలోల వెండి, విలువైన వస్తువుల అపహరణ
జవహర్‌నగర్: బంగారం దుకాణంలోకి సొరంగం ఏర్పాటు చేసి కొందరు దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. కాప్రా సర్కిల్ పరిధిలోని జమ్మిగడ్డ జైజవాన్‌కాలనీలో సిరివి జువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ పేరుతో బంగారు ఆభరణాల దుకాణాన్ని చంద్రప్రకాశ్ నిర్వహిస్తున్నా రు. సోమవారం రాత్రి పది గంటలకు దుకాణం మూసివేసి ఇంటికి వెళ్లారు.

అదేరోజు అర్ధరాత్రి దొంగలు దుకాణం వెనకున్న గోడ కింది నుంచి సొరంగం తవ్వి లోపలికి ప్రవేశించారు. లాకర్‌లో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకునే ప్రయత్నం చేసినా సాధ్యపడలేదు. చివరకు ర్యాక్‌లో ఉన్న ఆరు కిలోల వెండి ఆభరణాలతోపాటు విలువైన వస్తువులను తీసుకెళ్లారు. మంగళవారం ఉద యం దుకాణం తెరిచి చోరీ విషయం గుర్తించిన చంద్రప్రకాశ్.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. చోరీ సొత్తు విలువ సుమారు రూ.నాలుగు లక్షలు ఉంటుందన్నారు. పోలీసులు సీసీ కెమెరాల్లోని పుటేజీలను పరిశీలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement