
'వరంగల్ ఉప ఎన్నికలో మాదే విజయం'
టీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి.
హైదరాబాద్: టీఆర్ఎస్లోకి ఇతర పార్టీల నుంచి వలసలు కొనసాగుతున్నాయి. మంత్రులు కే తారకరామారావు, ఈటల రాజేందర్ సమక్షంలో ఆదివారం బీజేపీ నేత పరమేశ్, ప్రైవేట్ విద్యాసంస్థల సంఘం ప్రతినిధి పరంజ్యోతి టీఆర్ఎస్లో చేరారు. వారికి టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మార్చి నుంచే వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్ అందివ్వనున్నట్టు తెలిపారు. తెలంగాణకు కరెంటు ఉండదన్న ఆఖరి కిరణం ఆరిపోయిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం దేదీప్యమానంగా వెలుగుతోందని పేర్కొన్నారు. వరంగల్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ దే విజయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.