ఉమ్మడి హైకోర్టును విభజించాలని టీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో ఆందోళన చేపట్టారు.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును విభజించాలని టీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో ఆందోళన చేపట్టారు. హైకోర్టును వెంటనే విభజించాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ ఎంపీలు లోక్సభలో ఫ్లకార్డులను ప్రదర్శించారు.
లోక్ సభలో ఎంపీలు వెల్లోకి దూసుకెల్లి స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. హైకోర్టును విభజించి తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.