రెండు రైళ్లు ఢీ: 35 మందికి గాయాలు | Trains collide in southern Germany, 35 injured | Sakshi
Sakshi News home page

రెండు రైళ్లు ఢీ: 35 మందికి గాయాలు

Aug 2 2014 8:37 AM | Updated on Sep 2 2017 11:17 AM

దక్షిణ జర్మనీలోని మెన్హెయమ్ స్టేషన్ సమీపంలో ప్యాసింజర్ ట్రైన్ను గూడ్స్ ట్రైన్ ఢీ కొట్టింది.

బెర్లీన్: దక్షిణ జర్మనీలోని మెన్హెయమ్ స్టేషన్ సమీపంలో ప్యాసింజర్ ట్రైన్ను గూడ్స్ ట్రైన్ ఢీ కొట్టింది. ఆ ఘటనలో ప్యాసింజర్కు చెందిన ఐదు బోగీలు పట్టాలు తప్పాయిని ... 35 మంది ప్రయాణికులు గాయపడ్డారని రైల్వే ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. క్షతగాత్రులు సమీపంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారన్నారు.

పట్టాలు తప్పిన రైలును ట్రాక్పైకి తీసుకువచ్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గత రాత్రి ఆ ప్రమాదం జరిగినప్పుడు ప్యాసింజర్ ట్రైన్లో 250 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు.  ఫ్రెంచ్ సరిహద్దు సమీపంలోని సర్ర్బ్రూకెన్ నుంచి ఆస్ట్రియాలోని గ్రాజ్ పట్టణాల మధ్య ఆ ప్యాసింజర్ ట్రైన్ తిరుగుతుందని ఉన్నతాధికారి తెలిపారు.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement