గతేడాది రైలుప్రమాదాల్లో 25వేల మంది మృతి | train accidents claimed 25,006 lives in 2014 | Sakshi
Sakshi News home page

గతేడాది రైలుప్రమాదాల్లో 25వేల మంది మృతి

Aug 5 2015 7:23 AM | Updated on Sep 3 2017 6:50 AM

గతేడాది రైలుప్రమాదాల్లో 25వేల మంది మృతి

గతేడాది రైలుప్రమాదాల్లో 25వేల మంది మృతి

రైలు ప్రమాదాలు మన దేశంలో తరచు ఏదో ఒకమూల జరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరం.. అంటే 2014లో జరిగిన రైలు ప్రమాదాల్లో దాదాపు 25 వేల మందికి పైగా మరణఇంచారు, మరో 3,882 మంది గాయపడ్డారు.

రైలు ప్రమాదాలు మన దేశంలో తరచు ఏదో ఒకమూల జరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరం.. అంటే 2014లో జరిగిన రైలు ప్రమాదాల్లో దాదాపు 25 వేల మందికి పైగా మరణఇంచారు, మరో 3,882 మంది గాయపడ్డారు. ఈ విషయాన్ని జాతీయ నేర రికార్డుల బ్యూరో వెల్లడించింది. ఎన్ సీ ఆర్ బీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి...
 
  • రైలు ప్రమాదాలకు సంబంధించి 2014లో మొత్తం 28,360 కేసులు నమోదయ్యాయి.
  • అవి అంతకు ముందు సంవత్సరం వాటి కంటే మాత్రం 9.2 శాతం తక్కువే. 
  • ఎక్కువగా 61.6 శాతం ప్రమాదాలు రైళ్లలోంచి పడిపోవడం లేదా రైలు పట్టాల మీద వేరే వాహనాలతో రైళ్లు ఢీకొనడం వల్ల జరిగాయి. 
  • ఇలాంటి ప్రమాదాలు మహారాష్ట్రలో ఎక్కువగా జరిగాయి. 
  • మొత్తం కేసుల్లో 42.5 శాతం ఇక్కడివే ఉన్నాయి. 
  • మెకానికల్ వైఫల్యాల వల్ల.. అంటే డిజైన్ సరిలేకపోవడం, ట్రాక్ వైఫల్యాలు, బ్రిడ్జిలు/సొరంగాల సమస్యల కారణంగా 469 ప్రమాదాలు సంభవించాయి. 
  • ఇలాంటి రైల్వే మెకానికల్ వైఫల్యాల వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా 385 మంది మరణించారు. 
  • ఉగ్రవాదులు/తీవ్రవాదుల దుశ్చర్యల కారణంగా 18 ప్రమాదాలు సంభవించాయి. వాటిలో 18 ప్రాణాలు పోయాయి. 
  • డ్రైవర్ల తప్పిదాల కారణంగా 60 ప్రమాదాలు సంభవించగా, 67 మంది మరణించారు.

Advertisement
 
Advertisement
Advertisement