అల్‌కాయిదా అగ్ర నేత నాసిర్ హతం | Top al Qaeda leader reported killed in Yemen | Sakshi
Sakshi News home page

అల్‌కాయిదా అగ్ర నేత నాసిర్ హతం

Jun 17 2015 1:19 AM | Updated on Aug 17 2018 7:36 PM

అల్‌కాయిదా అగ్ర నేత నాసిర్ హతం - Sakshi

అల్‌కాయిదా అగ్ర నేత నాసిర్ హతం

అల్‌కాయిదాలో రెండో కీలకమైన నేతగా పేరుపొందిన నాసిర్ అల్-ఉహాయషి అమెరికా జరిపిన ద్రోన్ దాడుల్లో మరణించాడు.

దుబాయి: అల్‌కాయిదాలో రెండో కీలకమైన నేతగా పేరుపొందిన నాసిర్ అల్-ఉహాయషి అమెరికా జరిపిన ద్రోన్ దాడుల్లో మరణించాడు. ఈ విషయాన్ని అల్‌కాయిదా మంగళవారం నిర్ధారించింది.  ఇస్లామిక్ స్టేట్ జిహాదిస్టుల ప్రభావం పెరిగిపోతుండడంతో సతమతమవుతున్న అల్‌కాయిదాకు ఇటీవలి నెలల్లో పలు ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే ఒసామా బిన్ లాడెన్ మరణం తరువాత.. ఆ సంస్థకు అత్యంత భారీ ఎదురుదెబ్బగా నాసిర్ హతమవడాన్ని పరిగణిస్తున్నారు. అరేబియన్ ద్వీపకల్పంలోని అల్‌కాయిదా(ఏక్యూఏపీ) నాసిర్ మరణాన్ని నిర్ధారిస్తూ.. ఈ నెల 9న అమెరికా జరిపిన ద్రోన్ దాడుల్లో అతనితోపాటు మరో ఇద్దరు ముజాహిదీన్లు చనిపోయారని తెలిపింది.  కాగా తమ కొత్త అధిపతిగా ఖాసీం అల్ రిమి నియమితుడైనట్టు ఏక్యూఏపీ తెలిపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement