తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం సాయంత్రం వై రామవరం మండలం కడారికోటలో గిరిజనులతో సమావేశమయ్యారు.
అడవి బిడ్డలకు అండగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పర్యటన వర్షాన్ని లెక్కచేయకుండా ముందుకుసాగుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో అష్టకష్టాలు పడుతున్న గిరిజనుల గోడు తెలుసుకునేందుకు వైఎస్ జగన్ శనివారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. రాత్రికల్లా చాపరాయికి చేరుకోనున్న వైఎస్ జగన్.. అక్కడ బాధితులతో నేరుగా మాట్లాడానున్నారు. వారిని పరామర్శించి.. వారికి అందుతున్న సాయం గురించి ఆరా తీయనున్నారు. ఇంకా నేటి మరిన్ని వార్తావిశేషాలివి..
‘సీబీఐ కేసులకు భయపడుతున్న కేసీఆర్’
సీబీఐ కేసులకు భయపడే సీఎం కేసీఆర్ మోడీ తీసుకునే నిర్ణయాలకు మద్దతు ఇస్తున్నారని పొన్నం విమర్శించారు.
చంద్రబాబుతో రామసుబ్బారెడ్డి భేటీ
టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాజీమంత్రి రామసుబ్బారెడ్డి శనివారమిక్కడ భేటీ అయ్యారు.
టీడీపీ మహిళా ఎమ్మెల్యే భర్త దర్జా...
ఏపీ 5DA నంబర్‌తో తెలుగురంగు స్కార్పియో వాహనం ఎమ్మెల్యే కాకినాడ రూరల్ అనే స్టిక్కర్‌తో దూసుకొచ్చింది.
<<<<<<<<<<<<<<<< అంతర్జాతీయం >>>>>>>>>>>>>>>>
ఉత్తర కొరియాపై ఇక నాకు ఓపిక లేదు: ట్రంప్
ఉత్తర కొరియాపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ గుర్రుమన్నారు. ఆ దేశంపై తమకు ఇక ఓపిక పోయిందని, ఇక ఏ మాత్రం సహనంతో వ్యవహరించబోమని స్పష్టం చేశారు.
మోదీ ఇజ్రాయెల్ వెళ్తే.. ఎందుకంత ప్రాధాన్యం?
వాస్తవానికి ఓ ప్రధాని ఓ దేశానికి వెళ్లడం సాధారణమే. కానీ ఇజ్రాయెల్ మాత్రం అలా అనుకోవడం లేదు.
విమానంలో వాటర్ లీకేజీ.. వైరల్ వీడియో
ఎక్కడైనా పాత ఇళ్ల పైకప్పు నుంచి వర్షం నీళ్లు కారడం గురించి వింటుంటాం.
ఈ భార్యాభర్తల కథ తీవ్ర విషాదాంతం
పుట్టుకతోనే ఆమెకు గుండె సమస్య. చికిత్స చేసినా నయం కానీ పరిస్థితి. దీంతో గుండె మార్పిడి చేశారు. మళ్లీ ఊపిరిపోసుకుంది.
పండంటి బిడ్డకు జననం.. చుట్టుముట్టిన సింహాలు
ఆమె ఎలాంటి సమస్య లేకుండా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబు చాలా ఆరోగ్యంగానే ఉన్నాడు. కానీ, ముఖంలో సంతోషానికి బదులు భయాందోళనలు అలుముకున్నాయి.
<<<<<<<<<<<<<<<<< జాతీయం >>>>>>>>>>>>>>>>>>
'జీఎస్‌టీలో మా రాష్ట్రం పాత్ర ఎంతో ఉంది..'
వస్తు సేవా పన్ను(జీఎస్‌టీ)ను సాఫీగా అమలుచేయాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
చిక్కుల్లో పడ్డ ఎస్పీ నేత అజం ఖాన్
ఉత్తర ప్రదేశ్ మాజీ మంత్రి, సమాజ్ వాది పార్టీ సీనియర్ నేత అజం ఖాన్‑ మరోసారి చిక్కుల్లో పడ్డారు.
కరుడుగట్టిన ఉగ్రవాది ఖతం!
జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ ముగిసింది.
విద్యార్థులకు హెయిర్ కట్.. స్టాఫ్ అరెస్ట్
పాఠశాల నిబంధనలు పాటించలేదన్న కారణంగా విద్యార్థులకు ఓ ప్రైవేటు పాఠశాల సిబ్బంది హెయిర్ కట్ చేసి తీవ్ర విమర్శల పాలైంది.
546 మంది భారత ఖైదీలకు విముక్తి!
పాకిస్తాన్ జైళ్లల్లో మగ్గుతున్న 546 మంది భారతీయులకు త్వరలో విముక్తి లభించనుంది.
<<<<<<<<<<<<<<<<< బిజినెస్ >>>>>>>>>>>>>>>>>>
జీఎస్‌టీ ఎఫెక్ట్: ఐ ఫోన్, ఐ ప్యాడ్ ధరల్లో కోత
గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ నేటి(జూలై 1) నుంచి అమల్లోకి వచ్చిన నేపథ్యంలో యాపిల్ సంస్థ తన ఉత్పత్తుల ధరలను ఇండియాలో గణనీయంగా తగ్గించింది.
మారుతీ కారు ధరలు తగ్గాయి..
జీఎస్టీ ప్రభావంతో కార్ల ధరలు కిందకి దిగొస్తున్నాయి.
కాంగ్రెస్ జీఎస్టీ ఎందుకు తెలేదంటే ?
దేశంలో అస్తవ్యస్తమైన పన్నుల విధానాన్ని మొదటిసారిగా మోదీ ప్రభుత్వం సవరించిందని మంత్రి దత్తాత్రేయ పేర్కొన్నారు.
జేఎల్‌ఆర్ కూడా గుడ్‌న్యూస్
జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించేందుకు మరో ఆటో దిగ్గజం కూడా తన కార్లపై ధరలను తగ్గించింది.
జీఎస్‌టీపై చిదంబరం హెచ్చరిక.. ఏమిటది?
వస్తు సేవా పన్ను (జీఎస్‌టీ)పన్నుపై కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి పీ చిదంబరం పెదవి విరిచారు. అది అసలైన జీఎస్‌టీ కాదని అన్నారు.
<<<<<<<<<<<<<<<<< స్పోర్ట్స్ >>>>>>>>>>>>>>>>>>
ఆ దిగ్గజం మాటలు నన్నెంతో మార్చాయి!
గత ఐపీఎల్ సీజన్లో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను కలుసుకోవడం తనకెంతో కలిసొచ్చిందంటున్నాడు యువ సంచలనం బాసిల్ థంపి.
అశ్విన్ ఖాతాలో మరో ఘనత
ఇప్పటికే ఎన్నో రికార్డుల్ని సొంతం చేసుకున్న భారత క్రికెట్ ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ ఖాతాలో మరో అరుదైన ఘనతను సాధించాడు.
అది లేకపోతే మంచి కోచ్ కాలేడు: గంగూలీ
టీమిండియా ప్రధాన కోచ్ పదవి నుంచి అనిల్ కుంబ్లే నిష్క్రమణ తర్వాత బీసీసీఐ అడ్వైజరీ కమిటీలో సభ్యుడిగా ఉన్న సౌరవ్ గంగూలీ మరోసారి పెదవి విప్పాడు.
నేను వైన్ లాంటోడ్ని: ధోని
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా ఇక్కడ జరిగిన మూడో వన్డేలో భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ధనాధన్ మెరుపులు మెరిపించాడు.
<<<<<<<<<<<<<<<<< సినిమా >>>>>>>>>>>>>>>>>>
నాగ్ కు పుత్రోత్సాహం : సైమాలో అఖిల్ పాట
కింగ్ నాగార్జున ప్రస్తుతం తనయుల కెరీర్ ను చక్కబెట్టే పనిలో ఉన్నాడు. అందుకే తన సినిమాలను పక్కన పెట్టి మరి..
సంగీత్ వేడుకలో తమన్నా
టాలీవుడ్ అందాల తార తమన్సా భాటియా సోదరుడి మెహందీ ఫంక్షన్లో తళుక్కున మెరిసింది.
'ఖాకీ' డ్రస్‑లో కార్తీ
కోలీవుడ్ యంగ్ హీరో కార్తీ మరో ఇంట్రస్టింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
'తను తప్పు చేసిందని అనుకోవడం లేదు'
ప్రముఖ నటి సోహా అలీ ఖాన్‌కు మరో బాలీవుడ్ ప్రముఖ నటుడు టైగర్ ష్రాఫ్ అండగా నిలిచారు. ఆమె చీరకట్టుకోవడంలో తప్పేముందని అన్నారు.
సినీ నిర్మాత ఆస్తులు జప్తు
వేందర్ మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత మదన్‌కు షాక్ తగిలింది.