
జీఎస్‌టీలో మా పాత్ర ఎంతో ఉంది: పట్నాయక్
వస్తు సేవా పన్ను(జీఎస్‌టీ)ను సాఫీగా అమలుచేయాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
కొత్త పన్ను యుగంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ప్రజలందరికీ తన అభినందనలు తెలియజేశారు. ఈ కొత్త సంస్కరణ వాస్తవ రూపం దాల్చడంలో ఒడిశా ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని కూడా అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక సంస్కరణగా పేర్కొంటూ దేశ వ్యాప్తంగా ఒకే పన్ను విధానం ఉండేలాగా వస్తు సేవా పన్నును శుక్రవారం అర్థరాత్రి 12గంటల ప్రాంతంలో ప్రారంభించిన విషయం తెలిసిందే. మరోపక్క, జీఎస్‌టీని ఆహ్వానిస్తూ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఒడిశా తీరంలో జీఎస్‌టీతో సైకత శిల్పాన్ని ఏర్పాటుచేశారు.