
నాగ్ కు పుత్రోత్సాహం : సైమాలో అఖిల్ పాట
కింగ్ నాగార్జున ప్రస్తుతం తనయుల కెరీర్ ను చక్కబెట్టే పనిలో ఉన్నాడు. అందుకే తన సినిమాలను పక్కన పెట్టి మరి
కింగ్ నాగార్జున ప్రస్తుతం తనయుల కెరీర్ ను చక్కబెట్టే పనిలో ఉన్నాడు. అందుకే తన సినిమాలను పక్కన పెట్టి మరి నాగచైతన్య, అఖిల్ ల సినిమాల మీద దృష్టి పెట్టాడు. ఇప్పటికే నాగచైతన్యకు రారండోయ్ వేడుక చూద్దాం సినిమాతో భారీ కమర్సియల్ సక్సెస్ అందించిన నాగ్, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖిల్ రెండో సినిమాపై దృష్టి పెట్టాడు.
అయితే నాగ్ పుత్రోత్సాహం అఖిల్ సినిమా విషయంలో కాదు. అబుదాబిలో జరిగిన సైమా వేడుకలో అఖిల్ ప్రదర్శన నాగ్ కు ఎంతో సంతోషాన్నిచిందట. తొలి సినిమాతోనే నటుడిగా డ్యాన్సర్ ప్రూవ్ చేసిన అఖిల్, సైమా వేదికపై గాయకుడిగానూ ఆకట్టుకున్నాడు. 'సైమా 2017 వేదికపై అఖిల్ పాడుతుండగా నేను అక్కడే ఉన్నాను, ఈ ప్రదర్శన కోసం అఖిల్ ఎంతో సాధన చేశాడు' అంటూ తన తనయుడికి అభినందనలు తెలిపాడు నాగార్జున.
Wish I was there to see @AkhilAkkineni8 sing live at SIMA 2017 Abu Dhabi last nt/I know he's been practising hard/congratulations son!!pic.twitter.com/YYqYVb8fNt
— Nagarjuna Akkineni (@iamnagarjuna) 1 July 2017