సినీ నిర్మాత ఆస్తులు జప్తు
వేందర్ మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత మదన్‌కు షాక్ తగిలింది.
తమిళనాడు: ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయంలో సీట్లు ఇప్పిస్తామని చెప్పి మోసానికి పాల్పడిన కేసులో జైలు జీవితం అనుభవిస్తున్న వేందర్ మూవీస్ అధినేత, ప్రముఖ నిర్మాత మదన్‌కు షాక్ తగిలింది. మదన్‌కు సంబంధించిన రూ.6.35 కోట్ల స్థిరాస్తులను జప్తు చేయనున్నట్లు ఈడీ అడిషనల్ డైరెక్టర్ కేఎస్‌వీవీ. ప్రసాద్ శుక్రవారం తెలిపారు.
కాగా గత ఏడాది123 మంది వైద్య విద్యార్థులకు సీట్లు ఇప్పిస్తానని చెప్పి వారి తల్లిదండ్రుల నుంచి రూ. 85 కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు విచారణ జరిపి పలు ఆధారాలను సేకరించారు. వసూలు చేసిన డబ్బుతో మదన్ పలు బినామీ పేర్లతో ఆస్తులను కూడబెట్టినట్టు విచారణలో తేలింది.