నేడు తెలంగాణలో సెలవు | Today holiday in telangana | Sakshi
Sakshi News home page

నేడు తెలంగాణలో సెలవు

Jul 28 2015 9:13 AM | Updated on Aug 20 2018 3:02 PM

నేడు తెలంగాణలో సెలవు - Sakshi

నేడు తెలంగాణలో సెలవు

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి సంతాప సూచకంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.

హైదరాబాద్: మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి సంతాప సూచకంగా తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మంగళవారం అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలు, కార్యాలయాలు పనిచేయవు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

తెలంగాణలో చాలా ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఈ రోజు సెలవు ప్రకటించాయి. కాగా కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. సోమవారం రాత్రి షిల్లాంగ్లో అబ్దుల్ కలాం గుండెపోటుతో తుది శ్వాస విడిచిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement