భారీ వర్షంతో.. విమానాల దారి మళ్లింపు | Three flights diverted due to heavy rain Chennai | Sakshi
Sakshi News home page

భారీ వర్షంతో.. విమానాల దారి మళ్లింపు

Aug 1 2015 12:16 PM | Updated on Sep 3 2017 6:35 AM

చెన్నై విమానశ్రయంలో లాండ్ అవ్వాల్సిన మూడు విమానాలను భారీ వర్షం కారణంగా దారిమళ్లించినట్టు విమానశ్రయ అధికారులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

చెన్నై: చెన్నై విమానశ్రయంలో లాండ్ అవ్వాల్సిన మూడు విమానాలను భారీ వర్షం కారణంగా దారిమళ్లించినట్టు విమానశ్రయ అధికారులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చెన్నైలో ధారాపాతంగా వర్షం కురుస్తుండటంతో రెండు అంతర్జాతీయ విమానాలు, ఒక దేశియ విమానాన్ని బెంగళూరు, తిరుచునాపల్లి విమానశ్రయాలకు మళ్లించారు. అయితే చెన్నై ఎయిర్పోర్ట్కు శనివారం పూణె నుంచి ఒక దేశియ విమానం, సింగపూర్, ప్రాంక్పర్ట్ నుంచి రెండు అంతర్జాతీయ విమానాలు రావాల్సి ఉంది.

చెన్నైలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఆ మూడింటిని దారి మళ్లించాల్సి వచ్చిందని ఎయిర్ పోర్టు అధికారులు పేర్కొన్నారు. చెన్నై ఎయిర్పోర్ట్లో ఈ మూడు విమానల్లోకి ఎక్కేందుకు ప్రయాణికులంతా సిద్ధంగా ఉండగా, చివరి క్షణంలో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. దాంతో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement