సికింద్రాబాద్ లో యువతిపై ఆర్మీ జవాన్ల అత్యాచారయత్నం | Sakshi
Sakshi News home page

సికింద్రాబాద్ లో యువతిపై ఆర్మీ జవాన్ల అత్యాచారయత్నం

Published Mon, Nov 4 2013 5:19 PM

Three army jawan attempt rape, arrested in secunderabad

సికింద్రాబాద్ లో ఓ యువతిపై ముగ్గురు ఆర్మీ జవాన్లు అత్యాచారం యత్నానికి ప్రయత్నించినట్టు తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతంలో స్నేహితుడిని బెదిరించి యువతిని ఎత్తుకెళ్లి ఆర్మీ జవాన్లు కిరాతకానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. 
 
ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురిపై యువతి స్నేహితుడు తుకారం గేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో వారిపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్మీ జవాన్లపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. 
 
పోలీసుల కథనం ప్రకారం.. సికింద్రాబాద్ లోని  మహేంద్ర హిల్స్ లోని సాయిబాబా గుడి నుంచి వస్తున్న ఇద్దర్ని రాత్రి పది గంటల సమయంలో ఆర్మీ జవాన్లు అడ్డుకున్నట్టు తెలిసింది. ఆతర్వాత  స్నేహితుడిని కొట్టి యువతిని పోదల్లోకి ఎత్తుకెళ్లడంతో అతను స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం అందించాడని పోలీసులు తెలిపారు. 
 
స్నేహితుడు ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకుని.. యువతిని రక్షించారు. ఈ కిరాతకానికి పాల్పడిన ఆర్మీ జవాన్లను పోలీసులు అదుపులోకి తీసుకుని.. బాధితురాలిని ఆదివారం రాత్రి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారాన్ని మీడియాకు దృష్టికి రాకుండా చేయడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

 

 
Advertisement
 
Advertisement