
దొంగోడికి చుక్కలు చూపించిన ఆంటీ!
పంజాబీ ఆంటీలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. వారి ముందు ఎవరైనా పిల్లిమొగ్గలు వేస్తే.. అది వారికే డెంజర్.
పంజాబీ ఆంటీలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటారు. వారి ముందు ఎవరైనా పిల్లిమొగ్గలు వేస్తే.. అది వారికే డేంజర్. తాజాగా 49 ఏళ్ల పంజాబీ ఆంటీ కరంజిత్ సంఘా ఇదే విషయాన్ని ఓ దొంగోడికి చాటిచెప్పింది. ఏడు అంగుళాల కిచెన్ కత్తిని పట్టుకొని.. తన కన్నా పోటుగాడు లేడంటూ కరంజిత్‌ను భయపట్టేందుకు వచ్చిన దోంగోడు.. ఆంటీ ఇచ్చిన ఝలక్ తో ప్రాణాలు అరచేత పట్టుకొని పరుగులు తీశాడు.
కరంజిత్ సంఘాకు యూకేలోని హల్ ప్రాంతంలో ఓ కిరాణ దుకాణం ఉంది. ఆమె తన గల్లాపెట్టే ముందు కూర్చొని తాపీగా టీ తాగుతున్న సమయంలో దొంగోడు స్టువర్ట్ గ్లీసన్ ఆమెను భయపెట్టాలని నిర్ణయించుకున్నాడు. బహుశా అతడి జీవితంలో ఇదే అతి పెద్ద తప్పుడు నిర్ణయమేమో.. ఓ వంటింటి కత్తిని చూపించి.. గల్లాపెట్టేలోని డబ్బులు ఇవ్వమని ఆమెను బెదిరించాడు. కరంజిత్ చాలా నిగ్రహంగా చాయ్ తాగే వరకు ఆగుమని అతనికి చెప్పింది.
అయినా అతడు వినిపించుకోలేదు. చాయ్ కిందపెట్టి డబ్బులు ఇవ్వు అని గర్జించాడు. దీంతో ఓపిక నశించిన కరంజిత్ తనకు అందుబాటులో చిన్న కత్తిని తీసి ఒక చిన్న ఝలక్ ఇచ్చింది. అతనికి గాయాలు కాకుండా ఆ కత్తిని అటు-ఇటు తిప్పింది. దీంతో భయపడిపోయిన స్టువర్ట్ మళ్లీ వెనుకకు చూడకుండా పరుగులు పెట్టాడు. గత మే 26న ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై నమోదైన కేసును విచారించిన జడ్జి.. నిందితుడు స్టువర్ట్‌కు దొంగతనం, అక్రమంగా కత్తిని కలిగి ఉండటం అభియోగాలపై ఐదేళ్ల జైలుశిక్ష విధించారు.