అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి! | this is the date on Akhil Akkineni engagement | Sakshi
Sakshi News home page

అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి!

Nov 1 2016 7:41 PM | Updated on Jul 15 2019 9:21 PM

అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి! - Sakshi

అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి!

అక్కినేని వారి ఇంట త్వరలోనే పెళ్లి సందడి మొదలుకానుంది. అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్‌ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు.

హైదరాబాద్‌: అక్కినేని వారి ఇంట త్వరలోనే పెళ్లి సందడి మొదలుకానుంది. అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్‌ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. గత కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న ఫ్యాషన్‌ డిజైనర్‌ శ్రీయా భూపాల్‌- అఖిల్‌ నిశ్చితార్థం డిసెంబర్‌ 9వ తేదీన జరగనుందని సమాచారం. నిశ్చితార్థం అనంతరం అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిపించేందుకు ఇరుకుటుంబాలు సిద్ధమవుతున్నాయి. 
 
ఒకవైపు నాగాచైతన్య-సమంత ప్రేమించుకుంటున్నారనే వార్తలు వెలుగులోకి వచ్చిన వెంటనే అఖిల్‌-శ్రీయా ప్రేమకథ కూడా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన ఇద్దరు కొడుకుల పెళ్లిళ్లు ఒకేసారి చేసేందుకు నాగార్జున సిద్ధమయ్యారని కథనాలు వచ్చాయి. అయితే, పెళ్లి విషయంలో నాగాచైతన్య-సమంత ఇంకా ఒక నిర్ణయానికి రాకపోవడంతో ముందుగా అఖిల్‌-శ్రీయా భూపాల్‌ వివాహానికి నాగార్జున ఓకే చెప్పారు. 
 
ఫ్యాషన్ రంగంలో పేరొందిన శ్రీయా భూపాల్ తో గత కొన్నాళ్లుగా అఖిల్‌ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. టాలీవుడ్‌ భామలు శ్రీయ, కాజల్ అగర్వాల్, సమంత, రకుల్ ప్రీత్‌సింగ్‌లతో పాటు బాలీవుడ్ కథానాయికలు ఆలియా భట్, శ్రద్ధాకపూర్.. తదితరులకు శ్రీయా భూపాల్  దుస్తులు డిజైన్ చేశారు. అక్కినేని కుటుంబంతో శ్రీయా భూపాల్ కుటుంబానికి స్నేహం కూడా ఉందని సమాచారం. అఖిల్‌ వివాహం అనంతరం నాగాచైతన్య, సమంత కూడా పెళ్లి పీటలు ఎక్కవచ్చునని అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement