'బిల్లులో ఫైనాన్షియల్ మెమోరాండం లేదు' | there is no Financial memorandum in telangana bill, says Nk singh | Sakshi
Sakshi News home page

'బిల్లులో ఫైనాన్షియల్ మెమోరాండం లేదు'

Feb 20 2014 6:05 PM | Updated on Aug 18 2018 4:13 PM

'బిల్లులో ఫైనాన్షియల్ మెమోరాండం లేదు' - Sakshi

'బిల్లులో ఫైనాన్షియల్ మెమోరాండం లేదు'

ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లులో ఆర్థికపరమైన అంశాలు లేవని జేడీయూ ఎంపీ ఎన్.కె.సింగ్ స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లులో ఆర్థికపరమైన ప్యాకేజీలకు సంబంధించి ఎటువంటి కార్యాచరణ లేదని జేడీయూ ఎంపీ ఎన్.కె.సింగ్ స్పష్టం చేశారు. విభజన బిల్లు రాజ్యసభకు వచ్చిన సందర్భంగా సభలో మాట్లాడిన ఆయన తెలంగాణ బిల్లులో  ఫైనాన్షియల్ మెమోరాండం చేర్చకపోవటం దురదృష్టకరమన్నారు. ఈ బిల్లులో లక్ష్యాలేమిటో, ఉద్దేశాలేమిటో చెప్పకుండా, రాజకీయ కారణాలతో రాష్ట్ర విభజనకు పూనుకోవడం ఎంత మాత్రం తగదని ప్రభుత్వానికి సూచించారు.

 

బిల్లులో అనేక లోపాలు ఉన్నాయని ఆయన తెలిపారు. బిల్లును అమలుచేసే సరైన యంత్రాంగాలను...బిల్లులో పొందుపరచలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం రఘురాజన్ కమిటీ నివేదికను పక్కకు పెట్టిందని విమర్శించారు. బీహార్ లాంటి రాష్ట్రాలకు అర్హత ఉన్నా ఎలాంటి ప్యాకేజీ ఇవ్వలేదని సింగ్ తెలిపారు.

 

 

 

 

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement